ఎన్టీఆర్ కి జోడిగా శృతి హాసన్.. సెకండ్ హీరోయిన్ గా మరో క్రేజీ బ్యూటీ

Published : Apr 24, 2020, 05:13 PM IST
ఎన్టీఆర్ కి జోడిగా శృతి హాసన్.. సెకండ్ హీరోయిన్ గా మరో క్రేజీ బ్యూటీ

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రెండవ చిత్రానికి రంగం సిద్ధం అయింది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రెండవ చిత్రానికి రంగం సిద్ధం అయింది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి వస్తున్న ఆసక్తికర వార్తలు అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాయి. 

తాజా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఎన్టీఆర్ తో జతకట్టనునట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, శృతి హాసన్ ఇప్పటికే రామయ్య వస్తావయ్యా చిత్రంలో కలసి నటించారు. వాస్తవానికి శృతి హాసన్ ఎన్టీఆర్ కి జోడిగా దమ్ము చిత్రంలోనే నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల శృతి హాసన్ తప్పుకోవడం.. ఆ స్థానంలో త్రిష నటించడం జరిగింది. 

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్  రోల్ కోసం నివేత పేతురాజ్ పేరు పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ చిత్రానికి అయినను పోయి రావాలె హస్తినకు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కియారా అద్వానీ, పూజా  హెగ్డే లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ త్రివిక్రమ్ శృతి హాసన్ పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?