సౌత్ దర్శకుడితో షారుక్ బిగ్ మూవీ.. స్టోరీ ఫిక్స్!

By Prashanth MFirst Published Oct 15, 2019, 9:56 AM IST
Highlights

స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాలకు దూరమవుతున్నారని మొన్నటివరకు కొన్ని రూమర్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమాలను గ్యాప్ ఇస్తున్నారేమో అని అంతా అనుకుంటున్న వేళ.. నిజంగానే పూర్తిగా సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టేసే ఆలోచనలో ఉన్నట్లు నార్త్ మీడియాలో టాక్ వచ్చింది.

బాలీవుడ్ కింగ్ ఖాన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాలకు దూరమవుతున్నారని మొన్నటివరకు కొన్ని రూమర్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమాలను గ్యాప్ ఇస్తున్నారేమో అని అంతా అనుకుంటున్న వేళ.. నిజంగానే పూర్తిగా సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టేసే ఆలోచనలో ఉన్నట్లు నార్త్ మీడియాలో టాక్ వచ్చింది.   వరుస ఫ్లాపులు ఎదురవడంతో షారుక్ సినిమాల బిజినెస్ బాగా తగ్గిపోయింది. 

అయితే ఇంకా మార్కెట్ లో తన క్రేజ్ దిగజారకముందే ఎండ్ కార్డ్ పెట్టేయాలని ఆలోచిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కానీ అవన్నీ అబద్దమని తేలిపోయింది. షారుక్ కొంత గ్యాప్ తీసుకుంటున్నట్లు గతంలోనే ప్ క్లారిటీ ఇచ్చారు. ఇక అ గ్యాప్ కులం ఇప్పుడు ఎండ్ కార్డ్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. షారుక్ తో కోలీవుడ్ దర్శకుడు అట్లీ వర్క్ చేయడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. దాదాపు వారి మధ్య ఒక స్టోరీ లైన్ లాక్ అయ్యింది. 

మెర్శల్ - తేరి వంటి కథలతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న అట్లీ మరికొన్నిరోజుల్లో విజయ్ తో చేసిన మరో సినిమాని విడుదల చేయబోతున్నాడు. అదే బిగిల్ సినిమా. తెలుగులో విజిల్ టైటిల్ తో రిలీజ్ కాబోతోంది. దీపావళికి రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఆ సినిమా రిలీజ్ అనంతరం అట్లీ - షారుక్ ఖాన్ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.  

click me!