కరోనా: నిబంధనలను లెక్క చేయని స్టార్ హీరో.. మీడియా దెబ్బకి జంప్!

prashanth musti   | Asianet News
Published : Mar 19, 2020, 10:22 AM IST
కరోనా: నిబంధనలను లెక్క చేయని స్టార్ హీరో.. మీడియా దెబ్బకి జంప్!

సారాంశం

సెలబ్రెటీలు కరోనాను అరికట్టేందుకు వారి సలహాలు ఇస్తూనే ఎవరికి వారు స్వచ్చందంగా హౌజ్ అరెస్ట్ చేసుకుంటున్నారు. వైరస్ తగ్గుముఖం పట్టే వరకు కొంత నియంత్రణలో ఉంటూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాల షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రెటీలు కరోనాను అరికట్టేందుకు వారి సలహాలు ఇస్తూనే ఎవరికి వారు స్వచ్చందంగా హౌజ్ అరెస్ట్ చేసుకుంటున్నారు. వైరస్ తగ్గుముఖం పట్టే వరకు కొంత నియంత్రణలో ఉంటూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాల షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అయితే షాహిద్ కపూర్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహహరించడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కొన్ని  విధించిన నిబంధనలను విధించింది. జనాలు ఎక్కువగా ఉండే ముంబైలోని స్కూళ్లు, కాలేజీలు, మాల్స్‌, జిమ్‌లను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.  అయితే రూల్స్ ని పాటించకుండా షాహిద్‌ కపూర్‌ బాంద్రాలోని యాంటీ గ్రావిట్ క్లబ్‌లో క్లోజ్ చేసి ఉన్న జిమ్‌ను తెరిచి మరీ వర్కౌట్ చేశారు. ఆయన భార్య మీరా కూడా ఆ జిమ్‌లో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఒక్కసారిగా సోషల్ మీడియా నుంచి అన్ని మీడియా సంస్థలకు న్యూస్ చేరడంతో వెంటనే జిమ్ కి వెళ్లారు. అయితే మీడియా రాకను గమనించిన షాహిద్ అతని భార్య జిమ్ వెనకాల నుంచి జంప్ అయినట్లు తెలుస్తోంది. అయితే జిమ్ ఓనర్ మాత్రం షాహిద్ కేవలం తనతో మాట్లడటానికే వచ్చాడని చెప్పరు. అదే నిజమైతే అతను వెనకాల నుంచి పారిపోవాల్సిన అవసరం ఏమిటని పలు మీడియా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?