యాక్టింగ్ నేర్చుకుంటున్న సమంత.. ఇప్పుడు ఎందుకంటే!

Published : May 07, 2020, 11:40 AM IST
యాక్టింగ్ నేర్చుకుంటున్న సమంత.. ఇప్పుడు ఎందుకంటే!

సారాంశం

ప్రస్తుతం ఈ భామ ఆన్‌లైన్‌లో యాక్టింగ్ నేర్చుకుంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది సమంత. ఇండస్ట్రీకి వచ్చే పదేళ్లు పూర్తయిన తరువాత ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకోవటం ఏంటి అనుకుంటున్నారా..? 

కరోన లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. దీంతో సిని తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే తారలకు కాస్త ఖాళీ సమయం దొరకటంతో ఈ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ మంది సెలబ్రిటీలు వంట చేస్తూ, వర్క్‌ అవుట్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే సమంత మాత్రం ఈ హాలీడేస్‌ను తన టాలెంట్‌ను మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకుంటుంది.

ప్రస్తుతం ఈ భామ ఆన్‌లైన్‌లో యాక్టింగ్ నేర్చుకుంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది సమంత. ఇండస్ట్రీకి వచ్చే పదేళ్లు పూర్తయిన తరువాత ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకోవటం ఏంటి అనుకుంటున్నారా..? ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా తన నటనను మరింత మెరుగు పరిచేందుకు వినియోగించుకుంటుంది సమంత.

తాను హెలెన్‌ మెరీన్‌ నుంచి యాక్టింగ్ క్లాసులు తీసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన సమంత ఈ లాక్‌ డౌన్‌ పూర్తయ్యే లోపు తాను ఇంకా బెటర్ యాక్టర్‌ ను అవుతానని కామెంట్ చేసింది. అంతేకాదు ఒక వేళ బెటర్‌ యాక్టర్ కాలేకపోతే ఈ పోస్ట్‌ను డిలీట్‌ చేస్తానని సరదాగా కామెంట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?