అయోధ్య తీర్పుపై సల్మాన్ ఫ్యామిలీ రియాక్షన్.. మసీదు అవసరం లేదు!

By tirumala ANFirst Published Nov 11, 2019, 8:41 AM IST
Highlights

కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంతటి క్రేజ్ ఉన్న నటుడో అందరికి తెలుసు. సల్మాన్ ఖాన్ చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. పలు కేసుల్లో, వివాదాల్లో సల్మాన్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

సల్మాన్ ఖాన్ చివరగా 'భారత్' చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు  భారత్ మూవీ మంచి విజయం సాధించింది. త్వరలో సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 తో సందడి చేయబోతున్నాడు. ప్రభుదేవా దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. 

దేశంలో ఎలాంటి సంఘటన జరిగినా బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తుంటారు. అన్ని అంశాలపై తమ అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. కొన్ని శతాబ్దాల కాలం నుంచి అయోధ్య రామ జన్మ భూమి వివాదం రగులుతూనే ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఈ కేసు కోర్టుల్లో నానుతూనే ఉంది. ఏళ్ల నాటి ఈ సమస్యకు ముగింపు పలుకుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నవంబర్ 9న తుది తీర్పు వెల్లడించింది. 

వివాదాస్పద భూమిని హిందువులకే కేటాయిస్తూ తీర్పు వెల్లడించింది. ఇక ముస్లింల మసీదు నిర్మాణం కోసం మరో ప్రాంతంలో 5 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు వెల్లడించిన ఈ తీర్పుని అందరూ స్వాగతిస్తున్నారు. 

అత్యంత వివాదభరితమైన కేసు కావడంతో శాంతి భద్రతలపై ఆందోళన నెలకొంది. కానీ ఎలాంటి వ్యతిరేకత లేకుండా హిందువులు, ముస్లింలు సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నారు. 

అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ స్వాగతించింది. సల్మాన్ ఖాన్ తండ్రి ఈ అంశం గురించి స్పందించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని తాము స్వాగతిస్తున్నాం అని అన్నారు. సుప్రీం తీర్పు తర్వాత కూడా ప్రజలు శాంతితో కలసి మెలసి మెలగాలని సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ సూచించారు. 

సుప్రీం తీర్పు ప్రకారం ముస్లింలకు కేటాయించాల్సిన 5 ఎకరాల భూమిలో ప్రభుత్వం కళాశాల నిర్మించాలని సూచించారు. ముస్లింలకు మసీదు కన్నా కళాశాల చాలా ముఖ్యం అని సలీమ్ ఖాన్ అన్నారు. 

సల్మాన్ ఖాన్ తండ్రి సలీం కూడా బాలీవుడ్ లో నటుడిగా, రచయితగా, నిర్మాతగా రాణించారు. 

click me!