సాయిపల్లవి కొత్త చిత్రం ఫస్ట్ లుక్.. ఇంట్రస్టింగ్!

By AN TeluguFirst Published Oct 7, 2019, 3:40 PM IST
Highlights

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా `అధిరన్`. ఇప్పుడు ఈ చిత్రాన్ని అనుకోని అతిథి పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. 

ఫస్ట్ లుక్ , టీజర్, ట్రైలర్ ఇవి విభిన్నంగా ఉంటే గానీ జనాలు పట్టించుకోవటం లేదు. తమ సినిమాలో ఎంత విషయం ఉన్నా...దాని గురించి సరిగ్గా జనాలకు చేరకపోతే వృధానే. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని, చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు. తాజాగా సాయి పల్లవి చిత్రం అనుకోని అతిధి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. దసరా పండగ సందర్బంగా శుభాకాంక్షలు చెప్తూ రిలీజైన  ఈ లుక్ చాలా ఇంటెన్స్ గా  సినిమాపై ఆసక్తిని పెంచుతోందనటంలో సందేహం లేదు. 
 
చిత్రం వివరాల్లోకి వెళితే...సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా `అధిరన్`. ఇప్పుడు ఈ చిత్రాన్ని అనుకోని అతిథి పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. కొన్ని కాలం  క్రితం మలయాళంలో విడుదలైన ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కేరళలో భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై  ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ తెలుగులో అనువదిస్తున్నారు.

 నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్ మరియు అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందించిన జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తి అయ్యి మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ట్రైలర్ రిలీజ్ చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నామని చెప్పారు.

ప్రకాశ్‌రాజ్, అతుల్‌ కులకర్ణి రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి, మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్‌: అయూబ్‌ ఖాన్‌, కెమెరా: అను మోతేదత్‌, స్క్రీన్‌ప్లే: పి.ఎఫ్‌. మాథ్యూస్‌, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, సంగీతం: పి.ఎస్‌. జయహరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిన్‌ శ్రీనివాస్,  నిర్మాతలు:  అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్; దర్శకత్వం: వివేక్‌

click me!