నాగ్ చైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ లుక్.. టైటిల్ ఫిక్స్

By Prashanth MFirst Published Jan 14, 2020, 6:41 PM IST
Highlights

నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా  ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. స్వీట్ మ్యూజికల్ లవ్ స్టోరీ కి రూపొందుతున్న ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

అక్కినేని యువ హీరో నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా  ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. స్వీట్ మ్యూజికల్ లవ్ స్టోరీ కి రూపొందుతున్న ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.  హీరో,హీరోయిన్స్ కలసి ఉన్న పోస్టర్ కి చాలా మంచి రెస్సాన్స్ వస్తుంది.

ఒక ఇంటెన్సిటీ ఉన్న పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రేమలో కనిపించే బావోద్వేగాలను పోస్టర్ లో పలికించాడు శేఖర్ కమ్ముల. తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్ ని పోస్టర్ తో కలిగించారు శేఖర్ కమ్ముల.పోస్టర్ తో కథను పరిచయం చేయడం లో శేఖర్ కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది.  నాగచైతన్య , సాయి పల్లవి, శేఖర్ కమ్ముల క్రేజీ కాంబోకి తగ్గ లుక్ కి విడుదల చేసింది యూనిట్. రెహామాన్ స్కూల్ నుండి పరిచయం అవుతున్న ‘పవన్ ’ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతుంది. ఈ చిత్రానికి సంబందించిన లాస్ట్ షెడ్యూల్ పండుగ తర్వాత ప్రారంభం అవుతుంది.

సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటుంది.  ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

click me!