RRR: ఎన్టీఆర్, చరణ్ డైలాగులు ఎలా ఉంటాయంటే.. రాజమౌళి ఆల్రెడీ..

By tirumala ANFirst Published Nov 4, 2019, 4:25 PM IST
Highlights

తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

బాహుబలి తర్వాత అంతే భారీతనంతో అద్భుతమైన సినిమాలు తెరక్కించేందుకు పలువురు దర్శకులు, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. సాహో, సైరా చిత్రాలు ఆ కోవకు చెందినవే. ఇక రాజమౌళి తదుపరి చిత్రం ఏంటని దేశం మొత్తం ఎదురుచూస్తున్న తరుణంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రకటన జరిగింది. 

సౌత్ లో తిరుగులేని క్రేజీ హీరోలుగా కొనసాగుతున్న ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఒకే కాలానికి చెందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత ఎం జరిగిందనే విషయాన్ని రాజమౌళి కల్పిత గాధగా చూపించబోతున్నారు. 

ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరిగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. పదునైన మాటలు, హృదయాన్ని హత్తుకునే సంభాషణలతో సాయిమాధవ్ బుర్రా ప్రముఖ రచయితగా ఎదుగుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీకి డైలాగులు అందిస్తోంది ఆయనే. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిమాధవ్ బుర్రా ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. తన సినిమా విషయంలో రాజుగారికి అద్భుతమైన విజన్ ఉంటుంది. ఆయన మనస్సులో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆల్రెడీ పూర్తయిపోయింది. సినిమా ఎలా ఉండాలో రాజమౌళి తన విజన్ లో చూసేశారు. ఆయన మనస్సులో ఉన్న చిత్రానికి ఒక రూపం ఇచ్చేలా నేను మాటలు అందిస్తున్నా. 

రాజమౌళి లాంటి దర్శకుడు తెరక్కించే సినిమా డైలాగులు రాయడం సులభం కాదు. ఏమవుతుందో అని మొదట్లో భయపడ్డా. కానీ అంతా చాలా సింపుల్ గా జరిగిపోయింది. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నప్పటికీ కథలో బ్యాలెన్స్ ఉంది. కథకు అనుగుణంగానే వారిద్దరికీ డైలాగులు ఉంటాయి అని సాయిమాధవ్ బుర్రా అన్నారు. 

కృష్ణం వందే  జగద్గురుమ్, గోపాల గోపాల, గౌతమి పుత్ర శాతకర్ణి, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, మహానటి, సైరా లాటి అద్భుత చిత్రాలకు సాయిమాధవ్ పనిచేశారు. 

click me!