'ప్రతిరోజూ పండగే' టైటిల్ సాంగ్.. తమన్ సూపర్ ఫామ్ కంటిన్యూ..

By tirumala ANFirst Published Nov 4, 2019, 5:51 PM IST
Highlights

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ప్రతిరోజూ పండగే. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తేజు, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ప్రతిరోజూ పండగే చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ప్రతిరోజూ పండగే చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్, ఇటీవల విడుదల చేసిన గ్లిమ్ప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో మారుతి ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్.. ప్రతిరోజూ పండగే చిత్ర టైటిల్ సాంగ్ కు చక్కటి మ్యూజిక్ అందించాడు. ఆహ్లాదభరితమైన సంగీతం, అర్థవంతమైన సాహిత్యం ఆకట్టుకుంటోంది. 

ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ కెకె సాహిత్యం అందించారు. శ్రీకృష్ణ గాత్రం ఈ పాట స్థాయిని పెంచే విధంగా ఉంది. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ, సత్యరాజ్ పాత్రని తెలియజేసేలా టైటిల్ సాంగ్ ఉంది. సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 

గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న ప్రతిరోజూ పండగే చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. 

అప్పటి వరకు వరుస పరాజయాలు ఎదుర్కొన్న సాయిధరమ్ తేజ్.. ఈ ఏడాది విడుదలైన చిత్రలహరి చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. చిత్రలహరి విజయం తర్వాత తేజు ఆచితూచి కథలు ఎంచుకుంటున్నాడు. సుప్రీం తర్వాత తేజు, రాశి ఖన్నా మరోసారి రొమాన్స్ చేస్తున్న ప్రతిరోజూ పండగే చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. 

 

click me!