రవితేజ, శృతి హాసన్ మూవీ అప్డేట్.. ముహూర్తం ఫిక్సైంది!

By tirumala ANFirst Published Nov 12, 2019, 5:46 PM IST
Highlights

మాస్ మహారాజ రవితేజ స్పీడ్ పెంచుతున్నాడు. రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్నాడు. డిస్కోరాజా చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రవితేజ ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. మాస్ మహారాజాకు అర్జెంట్ గా ఓ హిట్ అవసరం. డిస్కో రాజా చిత్రం విభిన్న కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం విడుదల కాకముందే రవితేజ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

బలుపు లాంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన గోపీచంద్ మలినేని రవితేజతో మరో మూవీ చేయబోతున్నాడు. రవితేజ 66వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శత్వంలోనే ఉండబోతోంది. ఇటీవల గోపీచంద్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ప్రీలుక్ ని రిలీజ్ చేశారు. షాడో ఇమేజ్ లో రవితేజ తుపాకీ పట్టుకుని కనిపిస్తున్నాడు. బహుశా ఈ చిత్రంలో రవితేజ పోలీస్ అధికారిగా నటించబోతున్నాడేమో. 

రవితేజ సరసన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ నటులు వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించనున్నారు. తమన్ సంగీత దర్శకుడు కాగా.. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

🎬 Grand Launch & Muhurtham on November 14th

Mass MahaRaj pic.twitter.com/NYz6J0WQ8t

— #RT66 (@RT66Official)
click me!