'డిస్కో రాజా' లేటెస్ట్ అప్డేట్.. ట్రైలర్ రెడీ!

prashanth musti   | Asianet News
Published : Jan 14, 2020, 03:00 PM ISTUpdated : Jan 14, 2020, 03:07 PM IST
'డిస్కో రాజా' లేటెస్ట్ అప్డేట్.. ట్రైలర్ రెడీ!

సారాంశం

గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న హీరోల్లో రవితేజ ఒకరు. అవకాశం ఉన్న ప్రతిసారి డిఫరెంట్ కథలతో వస్తున్నప్పటికీ మాస్ రాజా సరైన బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోవడం లేదు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమాతో రాబోతున్నాడు. 

టాలీవుడ్ లో గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న హీరోల్లో రవితేజ ఒకరు. అవకాశం ఉన్న ప్రతిసారి డిఫరెంట్ కథలతో వస్తున్నప్పటికీ మాస్ రాజా సరైన బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోవడం లేదు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమాతో రాబోతున్నాడు.

రాజా ది గ్రేట్ సినిమా అనంతరం వరుస అపజయాలతో సతమతమవుతున్న మాస్ రాజాకు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందని ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక టాక్ వైరల్ అయ్యింది. కెవి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్ ఫిక్చన్ థ్రిల్లర్ మూవీలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రలతో కనిపించనున్నాడు.  ఇకపోతే సినిమాను జనవరి 24న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. అసలైతే డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.

కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో జనవరి ఎండ్ కి సినిమాని విడుదల చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా చిత్ర యూనిట్ ఒక డేట్ ని ఫిక్స్ చేసుకుంది.  జనవరి 19న హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. ఇదే వేడుకలో సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ట్రయిలర్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ - బన్నీ సినిమాల హడావుడి ముగిసిన అనంతరం డిస్కోరాజా బజ్ ని పెంచాలని మాస్ రాజా స్పెషల్ ప్లాన్ వేసుకున్నాడు. మరి సినిమా ఈ సీనియర్ హీరోకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నాభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?