ఆవిరి ట్రైలర్.. అనుకున్నంత లేదుగా..

By Prashanth MFirst Published Oct 10, 2019, 5:37 PM IST
Highlights

ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు మరో సినిమాతో సిద్దమయ్యాడు. అవును సీక్వెల్స్ తో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత పందిపిల్లతో ఒక ప్రయోగం చేశాడు.

అదుగో అనే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.  ఇక ఇప్పుడు ఆవిరి అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్తగా ట్రై చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ట్రైలర్ మాత్రం అంతగా క్లిక్కవ్వలేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఒక చిన్న పాపకు సంబందించిన త్రిల్లింగ్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది.  

కానీ రవిబాబు గత సినిమాల మాదిరిగానే హారర్ సీన్స్ ని ట్రైలర్ చూపించారు. మరి ఆ మ్యాజిక్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. దిల్ రాజు లాంటి నిర్మాత సినిమా ప్రొడక్షన్ తో చేతులుకలిపారు అంటే సినిమాలో కొత్తదనం గట్టిగానే ఉన్నట్లు ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే మంచి హైప్ క్రియేట్ అయ్యింది.  మరి సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి టాక్ ని అందుకుంటుందో చూడాలి.

click me!