ఇస్మార్ట్ హీరో రామ్ రాయల్ లుక్

prashanth musti   | Asianet News
Published : Jan 18, 2020, 06:45 PM IST
ఇస్మార్ట్ హీరో రామ్ రాయల్ లుక్

సారాంశం

photography by: Karthik Srinivasan ఎప్పుడు లేని విధంగా రామ్ ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ కార్తిక్ శ్రీనివాస్ నిర్వహించిన ఫోటో షూట్ లో రామ్ రాయల్ లుక్ లో దర్శనమిచ్చాడు, అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2019 టాలీవుడ్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లో రామ్ పోతినేని సినిమా టాప్ లిస్ట్ లో ఉందనే చెప్పాలి.  ఎక్కువగా ఆకర్షించిన ఇస్మార్ట్ శంకర్ పెట్టిన పెట్టుబడికంటే డబుల్ ప్రాఫిట్స్ ని అందించింది.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు రెడ్ సినిమాతో అదే స్థాయిలో హిట్టందుకోవాలని సిద్దమవుతున్నాడు.

అయితే ఎప్పుడు లేని విధంగా రామ్ ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ కార్తిక్ శ్రీనివాస్ నిర్వహించిన ఫోటో షూట్ లో రామ్ రాయల్ లుక్ లో దర్శనమిచ్చాడు, అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  గతంలో ఎప్పుడు లేని విధంగా తనలోని మాస్ నటనను ఇస్మార్ట్ శంకర్ తో  బయటపెట్టిన రామ్ ఇప్పుడు ఫోటో షూట్స్ లో కూడా స్టైల్ ని మారుస్తున్నాడు.

సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి ఫొటోస్ తో సరికొత్తకిక్కిస్తున్నాడు .  నెక్స్ట్ హోమ్ బ్యానర్ లో కిషోర్ తిరుమలతో ఇటీవల ఒక సినిమాను మొదలుపెట్టాడు.  రెడ్ సినిమా పూజా కార్యక్రమాలతో  క్రితమే అఫీషియల్ గా సెట్స్ పైకి వచ్చింది. గత కొంత కాలంగా అనేక కథలను వింటున్న రామ్ ఫైనల్ గా కిషోర్ చెప్పిన రెడ్ అనే థ్రిల్లర్ కథను ఒకే చేశాడు. రామ్ ఫస్ట్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో మరో స్మార్ట్ హిట్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?