Ram Pothineni : బోయపాటికి రామ్ పోతినేని బర్త్ డే విషెస్.. ఈ క్రేజీ కాంబో నుంచి అదిరిపోయే అప్డేట్..

Published : Apr 25, 2022, 04:09 PM IST
Ram Pothineni : బోయపాటికి రామ్ పోతినేని బర్త్ డే విషెస్.. ఈ క్రేజీ కాంబో నుంచి అదిరిపోయే అప్డేట్..

సారాంశం

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను  పుట్టిన రోజు సందర్భంగా ఎనర్జిటిక్  హీరో రామ్  పోతినేని బెస్ట్ విషెస్ తెలియజేశారు. అయితే వీరి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.  

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆంధ్రప్రదేశ్ లోని పెడకాకానిలో 1970 ఏప్రిల్ 25న జన్మించారు. 2005లో మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)తో ‘భద్ర’ సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ కు డెబ్యూ దర్శకుడిగా, రైటర్  గా పరిచయం అయ్యారు. అయితే బోయపాటి డైరెక్షన్  ఇతర దర్శకుల కంటే భిన్నంగా ఉంటుంది. హీరోకు తగ్గట్టుగా మాస్  విజువల్స్ ను చూపించడంలో ఆయనకు ఆయనే సాటి.  

అయితే, ఈ రోజు బోయపాటి పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు శ్రీనుకు శుభాకాంక్షలు  తెలుపుతున్నారు. ఈ సందర్భంగా చాక్లెట్ బాయ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) స్పెషల్ గా బోయపాటిని కలిసి బొకే అందించారు. ఆయన 52వ పుట్టిన రోజు సందర్భంగా తన బెస్ట్ విషెస్ తెలిపారు. మరోవైపు వీరి అప్ కమింగ్ ఫిల్మ్ యూనిట్ కూడా బోయపాటికి హార్ల్టీ విషెస్ తెలిపారు.

అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో రామ్ ను మునుపెన్నడూ చూడని విధంగా మాస్ విజువల్స్ తో ప్రజెంట్ చేయనున్నారట బోయపాటి. ఎమోషన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండనుందని, పాన్ ఇండియా సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. 

చివరిగా బోయపాటి నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య (Balakrishna)తో కలిసి బ్లాక్ బాస్టర్ మూవీ ‘అఖండ’ (Akhanda)ను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం ఏకధాటిగా వంద రోజులు థియేటర్లలో సందడి చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరోవైపు బాలయ్య నటన, డైలాగ్స్, మాస్ విజువల్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖండ భారీ విజయం సొంతం చేసుకోవడంతో బోయపాటిరాపో (BoyapatiRapo) కాంబినేషన్ పై అంచనాలు పెరుగుతున్నాయి.  రామ్ ప్రస్తతం తమిళ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?