తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జగన్, చిరుల భేటీపై తనదైన శైలిలో స్పందించాడు. 'వావ్.. 151తో 151' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సినీ నటుడు చిరంజీవి సోమవారం నాడు అమరావతిలో కలిసి.. సైరా సినిమా చూడాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయం అటు టాలీవుడ్ లోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. సోషల్ మీడియాలో కూడా వీరి భేటీ ట్రెండింగ్ గా మారింది. గన్నవరం
ఎయిర్ పోర్ట్ నుండి చిరంజీవి తన భార్య సురేఖాతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు.
చిరు దంపతులను సాదరంగా ఆహ్వానించారు జగన్. జగన్ కు సైరా సినిమా విశేషాలను చిరంజీవి వివరించారు. సినిమా తీసే సమయంలో చోటు చేసుకొన్న ఘటనలను చిరంజీవి సీఎం జగన్ కు వివరించారు. ఈ సందర్భంలోనే 'సినిమా బాగా తీశారన్నా..' అంటూ సీఎం వైఎస్ జగన్ సినీ నటుడు చిరంజీవిని అభినందించారట. ఇలాంటి మరెన్నో విజయవంతమైన సినిమాలు తీయాలని జగన్ సూచించారని స్వయంగా చిరంజీవే వెల్లడించారు.
undefined
చిరంజీవి అభ్యర్థనతో రెండు మూడు రోజుల్లో విజయవాడలోని పీవీపీ నిసిమా హల్‌లో సీఎం వైఎస్ జగన్ 'సైరా' సినిమాను వీక్షించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని చిరంజీవి అన్నారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జగన్, చిరుల భేటీపై తనదైన శైలిలో స్పందించాడు. 'వావ్.. 151తో 151' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
151 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్‌తో 151 సినిమాలు చేసిన చిరంజీవి కలయిక అని అర్ధం వచ్చే విధంగా వర్మ ఈ ట్వీట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, పాటలు విడుదల చేశాడు వర్మ. ఈ సినిమాతో మరో వివాదానికి తెరలేపుతున్నాడనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
WOWWWWW 151 with 151 💪 pic.twitter.com/qMq0evGkBR
— Ram Gopal Varma (@RGVzoomin)