దేవుడు థ్రిల్లర్ సినిమా చూపిస్తున్నాడు: రామ్‌ గోపాల్ వర్మ

Published : May 07, 2020, 05:45 PM IST
దేవుడు థ్రిల్లర్ సినిమా చూపిస్తున్నాడు: రామ్‌ గోపాల్ వర్మ

సారాంశం

తాజాగా విశాఖలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ప్రమాదంపై కూడా వర్మ తనదైన స్టైల్‌లో స్పందించాడు. `వైరస్‌ తరువాత ఇప్పుడు గ్యాస్‌ ఎటాక్‌.. ఇక ఎలియన్స్‌ రావటమే మిగిలింది. సినిమా ఇండస్ట్రీ షట్‌ డౌన్‌ కావటంతో దేవుడు నిజ జీవితాలతో థ్రిల్లర్ సినిమా చూపిస్తున్నాడు` అంటూ కామెంట్ చేశాడు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లోనే నిలుస్తున్నాడు. ఈ మధ్య కాలంలో తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేకపోయినా ఆ సినిమాలకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవటంలో ప్రతీ సారి సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఒక్క సినిమాల విషయంలోనే కాదు జాతీయ, అంతార్జాతీయ రాజకీయాలు పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన దైన స్టైల్‌లో మీడియాలో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు.

తాజాగా విశాఖలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ప్రమాదంపై కూడా వర్మ తనదైన స్టైల్‌లో స్పందించాడు. `వైరస్‌ తరువాత ఇప్పుడు గ్యాస్‌ ఎటాక్‌.. ఇక ఎలియన్స్‌ రావటమే మిగిలింది. సినిమా ఇండస్ట్రీ షట్‌ డౌన్‌ కావటంతో దేవుడు నిజ జీవితాలతో థ్రిల్లర్ సినిమా చూపిస్తున్నాడు. జాతీ,  మతం, దేశం అన్న బేధాలు లేకుండా ఆడ, మగ చిన్నారులను చంపే మూడు శక్తులు ఉగ్రవాదులు, వైరస్‌లు, దేవుడు. దేవుడు మానసికంగా ఏం ఇబ్బంది పడటం లేదు కదా ఇలాంటి ప్రాణాంతక వైరస్‌లను, గ్యాస్‌ లీకేజ్ ప్రమాదాలను సృష్టిస్తున్నాడు.

దేవుడంటే సృష్టిలో అన్నింటినీ సృష్టించేవాడు, పాలించేవాడు. అంటే వైరస్‌ను, గ్యాస్ లీకేజ్ ప్రమాధాన్ని ఆయనే సృష్టించాడా..? కానీ మనం మాత్రం దేవుణ్ని తప్ప అందరినీ బ్లేమ్‌ చేస్తాం.. ఎందుకంటే మనకు దేవుడంటే భయం` అంటూ తనదైన స్టైల్‌లో కామెంట్ చేశాడు వర్మ .

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?