కరోనాని వదలని వర్మ.. ఏకంగా పాట రాశేసాడు!

By Satish ReddyFirst Published Apr 1, 2020, 8:01 PM IST
Highlights

కరోనాని కూడా తన పబ్లిసిటీ కోసం వాడేస్తున్నాడు వర్మ. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా గురించి తానే స్వయంగా ఓ పాటను రాసి పాడాడు వర్మ. కనిపించని పురుగు అంటూ సాగే ఈ పాటకు సాండీ అద్దంకీ సంగీతమందించాడు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా వర్మ తీస్తున్న వివాదాలు సృష్టిచటమే తప్ప కలెక్షన్లు తేవటం లేదు. అదే సమయంలో వర్మ మాత్రం ప్రతీ సినిమాకు తనదైన స్టైల్‌లో ప్రమోషన్‌ చేస్తూ వివాదాలను మరింతగా పెంచిపోషిస్తున్నాడు. కేవలం సినిమాల విషయంలో మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల నుంచి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా తనదైన స్టైల్‌లో స్పందిస్తూ కావాల్సినంత పబ్లిసిటీ మూఠగట్టుకుంటున్నాడు.

తాజాగా కరోనాని కూడా తన పబ్లిసిటీ కోసం వాడేస్తున్నాడు వర్మ. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా గురించి తానే స్వయంగా ఓ పాటను రాసి పాడాడు వర్మ. కనిపించని పురుగు అంటూ సాగే ఈ పాటకు సాండీ అద్దంకీ సంగీతమందించాడు. ఈ పాటతో పాటు వర్మ ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటూ సందేశం కూడా ఇవ్వటం విశేషం.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వర్మ ప్రస్తుతం చైనీస్‌ భాగస్వామ్యంతో ఎంటర్‌ ది లేడీ డ్రాగన్‌ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కొన్ని తెలుగు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.

click me!