'నిన్ను చూసి గర్వపడుతున్నా..' భార్యపై రామ్ చరణ్ కామెంట్!

Published : Oct 05, 2019, 03:13 PM IST
'నిన్ను చూసి గర్వపడుతున్నా..' భార్యపై రామ్ చరణ్ కామెంట్!

సారాంశం

వ్యాపార విషయంలో, వ్యక్తిగత విషయంలో ఆమె ఎందరో మహిళలలకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ఉపాసనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ క్యాటగిరీలో మహాత్మా గాంధీ అవార్డు వరించింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగానే కాకుండా సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఉపాసన కొణిదెల కామినేని. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి మనవరాలైన ఉపాసనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. సమాజం కోసం తనవంతు సహాయం చేస్తుంటుంది.

అపోలో పేరిట చాలా మంది పిల్లలు ఉచిత వైద్యసేవలు అందిస్తుంటారు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి ఫిట్నెస్ కి సంబంధించి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాలను వీడియోల ద్వారా చెబుతుంటారు. వేల కోట్ల ఆస్తి ఉన్నా, మెగాస్టార్ కోడలైనా ఆమెకి ఎలాంటి గర్వం ఉండదని దగ్గరగా చూసిన వాళ్లు చెబుతుంటారు.

వ్యాపార విషయంలో, వ్యక్తిగత విషయంలో ఆమె ఎందరో మహిళలలకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ఉపాసనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ క్యాటగిరీలో మహాత్మా గాంధీ అవార్డు వరించింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా వెల్లడించి.. తనకు సహకరించిన సొసైటీకి, ఫ్యామిలీకి ధన్యవాదాలు చెప్పింది.

ఈ సందర్భంగా రామ్ చరణ్.. 'నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్ చేస్తున్న గొప్ప పనికి ఇలానే మరిన్ని అవార్డులు అందుకోవాలి' అని విషెస్ చెప్పాడు. అది చూసిన ఉపాసన.. 'థాంక్స్ మిస్టర్ సి.. నీ ప్రేమ, సపోర్ట్ లేకుండా ఇవి సాధించేదాన్ని కాదు' అని బదులిచ్చింది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?