Ram Charan: రామ్ చరణ్...చెల్లుకు చెల్లు స్కీమ్, భలే ఉందే

By Surya PrakashFirst Published Jun 27, 2022, 8:12 AM IST
Highlights


సల్మాన్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతూంటే రామ్ చరణ్ చూడటానికి వెళ్లారు. అయితే వెంటనే సల్మాన్ కు రామ్ చరణ్ తన పాటలో కనపిస్తే బాగుంటుందనిపించిట. అడగటం..రామ్ చరణ్ ఓకే చెప్పటం జరిగిపోయిందిట. సల్మాన్, రామ్ చరణ్ కలసి వేసే స్టెప్స్ లు ఓ రేంజిలో ఉంటాయంటున్నారు.


ఇప్పుడు హీరోలందరిదీ ఒకటే ఆలోచన. తమ సినిమాలు వేర్వేరు భాషల్లో రిలీజ్ కావాలి. మార్కెట్ పెరగాలి. అందుకోసం రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు.ముఖ్యంగా వేరే లాంగ్వేజ్ లలో పాపులర్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చి తమ సినిమాల్లో నటింప చేస్తున్నారు. అలాగే వేరే భాషల హీరోలను తమ సినిమాలో గెస్ట్ గా చేయిస్తున్నారు. దాంతో ఆటోమేటిక్ గా సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ అవుతుంది. మీడియాలోనూ సినిమా తెగ నలుగుతుంది. అందుకే అక్కడ హీరోలు ఇక్కడ కామెయోగా కనిపిస్తే..ఇక్కడ హీరోలు అక్కడ గెస్ట్ రోల్ లో మెరిసిపోతున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ సైతం ఓ హింది సినిమాలో గెస్ట్ గా కనిపించనున్నారు. వివరాల్లోకి వెళితే...

చిరంజీవి ’గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖానా్ క్యామియో రోల్ లో  నటిస్తున్నారు. గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్, బ్రిట్నీ స్పియర్స్‌తో ఓ స్పెషల్ సాంగ్‌ ఉంది.  మలయాళ ఒరిజినల్ ’లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఆ చిత్రంలో కీ  రోల్ పోషించారు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌ చేస్తున్నారు.  ఇప్పటికే సల్లూ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

ఇక సల్మాన్ ఖాన్.. చిరంజీవి చిత్రంలో క్యామియో రోల్ పోషిస్తుండంతో రామ్ చరణ్.. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమాలో కెమియో రోల్ చేయడానీకి ఓకే చెప్పారు. ఓ పాటలో రామ్ చరణ్ పాత్ర ఎంట్రీ అదిరిపోయే లెవల్లో ఉంటుందని టాక్. ఈ పాట షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. సల్మాన్ ఖాన్ తో పాటు రామ్ చరణ్ స్టెప్స్ట్ వేస్తున్నారు.  అయితే అది అనుకోకుండా జరిగిందిట.

సల్మాన్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతూంటే రామ్ చరణ్ చూడటానికి వెళ్లారు. అయితే వెంటనే సల్మాన్ కు రామ్ చరణ్ తన పాటలో కనపిస్తే బాగుంటుందనిపించిట. అడగటం..రామ్ చరణ్ ఓకే చెప్పటం జరిగిపోయిందిట. సల్మాన్, రామ్ చరణ్ కలసి వేసే స్టెప్స్ లు ఓ రేంజిలో ఉంటాయంటున్నారు. 

ఇక ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. కభీ ఈద్ కభీ దీవాళి’ చిత్రంలో వెంకటేష్.. పూజా హెగ్గే అన్న పాత్రలో నటిస్తున్నారు. అనారీ, తక్‌దీర్‌వాలా సినిమాల తర్వాత వెంకటేష్ బాలీవుడ్‌లో చేస్తోన్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు పర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. 

click me!