విజయ్ దేవరకొండతో జత కట్టాలనేది నా కోరిక : రకుల్

Published : Oct 12, 2019, 01:54 PM IST
విజయ్ దేవరకొండతో జత కట్టాలనేది నా కోరిక : రకుల్

సారాంశం

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్.. తాను నటించే సినిమాల సంఖ్య తగ్గిందని, వరుస ఫ్లాప్ ల కారణంగానే కొత్త చిత్రాల అవకాశాలు రావడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పింది. 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ కి ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గాయి. కానీ ఆమె మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడం లేదు. ఫ్లాప్ ల కారణంగా తనకు అవకాశాలు తగ్గాయనే ప్రచారం చేస్తున్నారని రకుల్ ఫైర్ అయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్.. తాను నటించే సినిమాల సంఖ్య తగ్గిందని, వరుస ఫ్లాప్ ల కారణంగానే కొత్త చిత్రాల అవకాశాలు రావడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పింది. నిజం చెప్పాలంటే తాను నటిగా పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అంతస్తును అందుకున్నానని చెప్పింది. హిందీలో పలు అవకాశాలు రావడంతో దక్షిణాదిలో అవకాశాలను అంగీకరించలేకపోతున్నట్లు తెలిపింది.

అంతేకానీ అవకాశాలు రాక కాదని, అయినా తనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కథలను ఎంపిక చేసుకోవడంలో తనకు పరిణితి వచ్చిందని చెప్పింది. ఏదో నాలుగు పాటల్లో ఆడి, రెండు మూడు సన్నివేశాల్లో కనిపించే పాత్రల్లో నటించడం తనకు ఇష్టం లేదని చెప్పింది. మంచి కథలను ఎంపిక చేసుకొని నటిస్తానని చెప్పింది. 

తమిళ, తెలుగు భాషల్లో ప్రముఖ నటులతో నటించాలని, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటుడితో కలిసి నటించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదని చెప్పింది. హిందీలో రణవీర్ సింగ్, తెలుగులో విజయ్ దేవరకొండలతో జత కట్టాలనేది తన కోరిక అని వెల్లడించింది. అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు రకుల్ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?