థియేటర్ లోకి వరద వచ్చినా.. చిరు సినిమాపై రాఘవేంద్ర రావు కామెంట్

By tirumala ANFirst Published Nov 5, 2019, 5:36 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో అనేక అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. కానీ వీరిద్దరి పేరు చెప్పగానే జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రం గుర్తుకు వస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో ఆ మూవీ ఎవరు గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోతుంది. 

చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం దర్శకుడిగా తనకు పునర్జన్మ లాంటిది అని రాఘవేంద్ర రావు అన్నారు. అలీతో సరదాగా కార్యక్రమంలో రాఘవేంద్ర రావు అనేక విషయాలు పంచుకున్నారు. ప్రతి దర్శకుడి కెరీర్ లో ఒడిదుడుకులు తప్పకుండా ఉంటాయి. 

నా కెరీర్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ముందు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. దీనితో ఇక రాఘవేంద్ర రావు పనైపోయింది అని అంతా కామెంట్స్ చేశారు. చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని ప్రకటించగానే విఠలాచార్య చేయాల్సిన సినిమాని రాఘవేంద్ర రావు చేస్తున్నారు. ఏమవుతుందో ఏమో అని కామెంట్స్ చేసిన వారు కూడా ఉన్నారు. 

ఈ విమర్శలకు తోడు సినిమా విడుదల సమయంలో భయంకరమైన తుఫాన్ వచ్చింది. కానీ ప్రేక్షకులు థియేటర్స్ కి రాకుండా తుఫాన్ అడ్డుకోలేకపోయింది. జనం గొడుకులు వేసుకుని వచ్చారు. కొన్ని థియేటర్స్ వరద నీటితో నిండినా కాళ్ళు కుర్చీలపై పెట్టుకుని సినిమా చూశారు. అందుకే జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించిందని రాఘవేంద్ర రావు అభిప్రాయ పడ్డారు. 

చిరంజీవి, రాఘవేంద్ర రావు కాంబోలో దాదాపు 13 చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబోలో ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్ళు లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. 

 

 

 

click me!