Asuran Telugu remake: వెంకటేష్‌కి జోడిగా సీనియర్ హీరోయిన్

prashanth musti   | Asianet News
Published : Jan 02, 2020, 12:20 PM ISTUpdated : Jan 02, 2020, 12:28 PM IST
Asuran Telugu remake: వెంకటేష్‌కి జోడిగా సీనియర్ హీరోయిన్

సారాంశం

వెంకటేష్ మొత్తానికి 2019ని సక్సెస్ ఫుల్ ఇయర్ కి ఎండ్ చేశాడు. చాలా కాలం తరువాత F2 - వెంకిమామ లాంటి డిఫరెంట్ మల్టీస్టారర్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ఇక అదే రేంజ్ లో 2020ని కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటున్న వెంకీ మొదట అసురన్ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు.

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ మొత్తానికి 2019ని సక్సెస్ ఫుల్ ఇయర్ కి ఎండ్ చేశాడు. చాలా కాలం తరువాత F2 - వెంకిమామ లాంటి డిఫరెంట్ మల్టీస్టారర్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ఇక అదే రేంజ్ లో 2020ని కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటున్న వెంకీ మొదట అసురన్ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు.

మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2006లో పెళ్ళైన కొత్తలో సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన ఈ బ్యూటీ అనంతరం యమదొంగ సినిమాతో అప్పట్లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంది.

అయితే ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకున్నప్పటికీ సరైన సక్సెస్ లు అందుకోలేదు. దీంతో అమ్మడు తన ప్రియుడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. పెళ్లయ్యాక కూడా ఆఫర్స్ అస్తున్నప్పటికీ అమ్మడు కేవలం తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తోంది. ఫైనల్ గా ఇప్పుడు వెంకటేష్ కి సతీమణిగా అసురన్ రీమేక్ లో నటించడానికి గ్రీన్ ఇచ్చింది. మరి ఆ సినిమా అమ్మడికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?