ప్రభాస్ తో అర్జున్ రెడ్డి డైరెక్టర్.. నిజమేనా?

prashanth musti   | Asianet News
Published : Dec 25, 2019, 04:18 PM IST
ప్రభాస్ తో అర్జున్ రెడ్డి డైరెక్టర్.. నిజమేనా?

సారాంశం

అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆ సినిమా బాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక లాభాల్ని అందించిన సినిమాగా నిలిచింది.

ఒకే ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుందని సందీప్ వంగ చాలా స్ట్రాంగ్ గా నిరూపించాడు. అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆ సినిమా బాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక లాభాల్ని అందించిన సినిమాగా నిలిచింది.

కబీర్ సింగ్ పేరుతో విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ హిందీలో 275కోట్ల వసూళ్లను అందుకుంది. ఆ దెబ్బతో డైరెక్టర్ సందీప్ వంగ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. వెంటనే మరో హిందీ సినిమా స్టార్ట్ చేసేందుకు సిద్దమయ్యాడు. రణ్ వీర్ తో సందీప్ నెక్స్ట్ యాక్షన్స్ అండ్ స్పస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఒక డిఫరెంట్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

సందీప్ ఆల్ మోస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడన్న సమయంలో కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. కథలో కథానాయకుడు నెగిటివ్ షెడ్ లో కనిపించనున్నాడట. అయితే సినిమా స్క్రీన్ ప్లే పై కాస్త సందేహం వ్యక్తం చేసిన రణ్ బీర్ సినిమా చేయలేనని మనసు మార్చుకున్నాడట. దీంతో సందీప్ రెబల్ స్టార్ ప్రభాస్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఇటీవల ప్రభాస్ కి లైన్ వినిపించిన సందీప్ రెబల్ స్టార్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాన్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ సందీప్ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఇంకా ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోలేదు గాని త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?