'పంజా' ఆడియో వేడుకలో మెరిసిన పవన్ ఫ్యాన్.. ఇప్పుడు సబ్ కలెక్టర్

Published : May 15, 2020, 09:25 AM IST
'పంజా' ఆడియో వేడుకలో మెరిసిన పవన్ ఫ్యాన్.. ఇప్పుడు సబ్ కలెక్టర్

సారాంశం

దాదాపు 9 ఏళ్ల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ పంజా చిత్రం అభిమానులకు బాగా గుర్తే. కనీవినీ ఎరుగని అంచనాలతో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

దాదాపు 9 ఏళ్ల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ పంజా చిత్రం అభిమానులకు బాగా గుర్తే. కనీవినీ ఎరుగని అంచనాలతో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ కొందరు అభిమానులు మాత్రం ఆ చిత్రంలో పవన్ మ్యానరిజమ్స్, స్టైల్ ని ఇష్టపడతారు. 

తాజాగా పంజా చిత్రం పవన్ అభిమానులకు మరో తీపి జ్ఞాపకంగా మారింది. పంజా ఆడియో వేడుకలో ఫ్యాన్స్ కొందరు స్వయంగా పవన్ ని వేదికపై కలుసుకునే అవకాశం దక్కించుకున్నారు. అందులో పృథ్వి తేజ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ఆ సమయంలో పృథ్వి తేజ ఐఐటి జేఈఈలో ఫస్ట్ రాంక్ సాధించాడు. 

కాజల్ సెక్సీ ఫోజులు.. నడుము అందాలతో మైమరపిస్తోంది..

దీనితో పవన్ కళ్యాణ్ స్వయంగా పృథ్వి తేజని సత్కరించి అభినందించాడు. భవిషత్తులో పృథ్వి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పవన్ ఆకాంక్షించారు. కాల గమనంలో 9 ఏళ్ళు గడచిపోయింది. కట్ చేస్తే ప్రస్తుతం పృథ్వి తేజ మదనపల్లె సబ్ కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించాడు. పృథ్వి తేజ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ లో 24 వ ర్యాంక్ సాధించడం విశేషం. పృథ్వి 24 వ ర్యాంక్ సాధించిన సందర్భంలో అతడు యువతకు ఆదర్శం అంటూ స్వయంగా పవన్ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. 

 

పవన్ కళ్యాణ్ అభిమాని సబ్ కలెక్టర్ కావడం తమకు ఎంతో గర్వకారణం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ పృథ్వి తేజ గురించి చెప్పిన మాటలని వైరల్ చేస్తున్నారు. పంజా నిర్మాత నీలిమ తిరుమలశెట్టి కూడా పృథ్వి తేజని అభినందిస్తూ ట్వీట్ చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?