జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తరచుగా కొందరు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది శ్రీరెడ్డి వ్యవహారం చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. శ్రీరెడ్డి తరచుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు చేస్తోంది. ఇక పూనమ్ కౌర్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ పై కొందరు ఫిలిం సెలెబ్రిటీలు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు ప్రముఖులు పవన్ కి మద్దతు తెలుపుతుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా నటి పూనమ్ కౌర్ తన సంచలన వ్యాఖ్యలతో అప్పుడప్పుడూ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ముఖ్యంగా ఆమె ట్విట్టర్ లో పరోక్షంగా ఎవరినో ఉద్దేశించినట్లు అన్నట్లుగా ఉండే ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో పూనమ్ కౌర్ చేసిన చాలా ట్వీట్స్ గురించి అభిమానుల్లో హాట్ హాట్ గా చర్చ జరిగింది. ఇటీవల పూనమ్ కౌర్ చేసిన మరో ట్వీట్ బాగా వైరల్ అయింది.
A liar can become a politician but never a leader ....
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal)'అబద్దాలు చెప్పే వాడు రాజకీయ నాయకుడు అవుతాడేమో కానీ.. నాయకుడు కాలేడు' అని ట్వీట్ చేసింది. పూనమ్ చేసిన ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే అని మీడియా మొత్తం వార్తలు రాసింది. పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. గతంలో పూనమ్ కౌర్, పవన్ గురించి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
పూనమ్ చేసిన ట్వీట్ కూడా పవన్ ని ఉద్దేశించే అని కొందరు పెద్ద ఎత్తున వార్తలు రాశారు. తన ట్వీట్ జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళుతుండడంతో పూనమ్ కౌర్ మరో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తాను చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించినవి కావని.. సాధారణంగా సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై తన అవగాహన అని పూనమ్ కౌర్ పరోక్షంగా తెలిపింది. పవన్ ని ఉద్దేశించి తప్పుడు రాతలు రాసిన మీడియాపై విరుచుకుపడింది కూడా.
'నేను చేసిన వ్యాఖ్యలు సమాజంలో జరుగుతున్న నిజానిజాల గురించి. కానీ మీరు మాత్రం ఏదేదో ఊహించుకుంటూ ఊహాలోకంలో విహరిస్తున్నారు. ముఖ్యంగా పైడ్ మీడియా తన వ్యాఖ్యలని తప్పుదోవ పట్టిస్తూ లబ్ది పొందుతోంది. నేను చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు సంబంధించినవి. మీరు మీరు ఊహాలోకంలోనే ఉండండి' అంటూ పూనమ్ కౌర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
My observation involves facts n reality ..... ur perception is just suspicion ....probability n ( paid media )benefitting outta vulnerable situation ...... I stand by what I am saying ...u live in ur imaginary n limited world .... have mercy on a lotta u ..... god bless ....
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal)పూనమ్ మొదట చేసిన ట్వీట్ తో కొంతమంది నెటిజన్లు పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేశారు. తాజాగా క్లారిటీ ఇవ్వడంతో పవన్ అభిమానులు సంతోషిస్తున్నారు. పవన్ ని తప్పుగా అర్థం చేసుకున్న వారికి పూనమ్ బుద్ధి చెప్పిందని అంటున్నారు.