ఆ హీరోతో లిప్ లాక్.. ఇబ్బంది పడ్డా : పూజా హెగ్డే

By AN Telugu  |  First Published Dec 28, 2019, 10:54 AM IST

తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె ముద్దు సన్నివేశాల గురించి మాట్లాడారు. అలాంటి సన్నివేశాల వలన ఇబ్బంది పడుతుంటామని చెప్పారు. 


టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నటి పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది. ఈ ఏడాదిలో ఆమె నటించిన 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'హౌస్ ఫుల్ 4' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఆమె నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతోంది.

తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె ముద్దు సన్నివేశాల గురించి మాట్లాడారు. అలాంటి సన్నివేశాల వలన ఇబ్బంది పడుతుంటామని చెప్పారు. 'మొహంజోదారో' సినిమాలో హృతిక్ రోషన్ కి ముద్దు పెట్టే సీన్ ని గుర్తు చేసుకున్నారు.

Latest Videos

బికినీ వేసుకొని హాట్ షో చేస్తోన్న రాజశేఖర్ కూతుళ్లు!

ముద్దు సన్నివేశాలు వెండితెరపై చూడడానికి ప్రేక్షకులకు బాగుంటాయి కానీ ఆ సీన్ లో నటించడం తారలు ఎంత కష్టపడతారో ప్రజలకు తెలియదని అన్నారు. హృతిక్ తో ముద్దు సీన్ ఉందని.. షూట్ కి ముందు దర్శకుడు తనకు వివరించాడని.. తను కూడా లిప్ లాక్ సీన్ కి సిద్ధమైనట్లు చెప్పింది.

కానీ ఆ సమయంలో వణుకు పుట్టిందని.. అంతకముందు అలాంటి సన్నివేశాలు చేయలేదని చెప్పింది. తమ చుట్టూ చాలా మంది జనాలు నిలబడి ఉన్నారని.. చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. రొమాంటిక్ సంనివేసహాల్లో ప్రధాన తారాగణం మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యమని చెప్పింది.

అలానే కెమెరా ట్రిక్స్ కూడా ఈ సీన్ల విషయంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చింది. వాటి వలన ఇబ్బందికర సంఘటనల నుండి తప్పించుకుంటామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ 'జాన్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

click me!