బిగ్ స్క్రీన్ పై పవన్ డబుల్ యాక్షన్.. ఫ్యాన్స్ కి పండగే!

prashanth musti   | Asianet News
Published : Mar 24, 2020, 12:48 PM IST
బిగ్ స్క్రీన్ పై పవన్ డబుల్ యాక్షన్.. ఫ్యాన్స్ కి పండగే!

సారాంశం

పవన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని మెగా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ కమ్ బ్యాక్ ఫిల్మ్ పై అంచనాలు అకాశాన్ని దాటేశాయి. పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఇప్పటికే రెడీ అయ్యింది. ఇక ఆ తరువాత పిరియడిక్ ఫిల్మ్ వీరుపక్షి తో సరికొత్తగా అలరించేందుకు పవర్ స్టార్ సిద్ధమవుతున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని మెగా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ కమ్ బ్యాక్ ఫిల్మ్ పై అంచనాలు అకాశాన్ని దాటేశాయి. పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఇప్పటికే రెడీ అయ్యింది. ఇక ఆ తరువాత పిరియడిక్ ఫిల్మ్ వీరుపక్షి తో సరికొత్తగా అలరించేందుకు పవర్ స్టార్ సిద్ధమవుతున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకున్న పవన్ కళ్యాణ్ కి కరోనా ఆంక్షల కారణంగా బ్రేక్ పడింది. సినిమా షెడ్యూల్స్ మళ్ళీ రీ ప్లాన్స్ చేయాల్సి ఉంది. ఇంకొక నెల వరకు షూటింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. 'వీరూపాక్షి' లో పవర్ స్టార్ రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తారట. డబుల్ యాక్షన్ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కెరీర్ లో ఒక్కసారి మాత్రమే ద్విపాత్రాభినయంలో కనిపించాడు.

'తీన్ మార్' లో అర్జున్ పాల్వాయ్ , మైకేల్ వేలాయుధం అనే పాత్రల్లో కనిపించిన పవన్ ఇంతవరకు డ్యూయల్ రోల్ లో కనిపించలేదు. ఇక ఇన్నాళ్లకు క్రిష్ ద్వారా తెరపై ఒకేసారి ఇద్దరు పవన్ కళ్యాణ్ లు దర్శనమిచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఖుషి నిర్మాత AM.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మరొక సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?