పవన్ 'పింక్' రీమేక్.. లోకల్ పిల్లకి బంపర్ ఆఫర్

prashanth musti   | Asianet News
Published : Dec 18, 2019, 12:49 PM ISTUpdated : Dec 18, 2019, 12:58 PM IST
పవన్ 'పింక్' రీమేక్.. లోకల్ పిల్లకి బంపర్ ఆఫర్

సారాంశం

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరమే లేదు. అయితే అది పింక్ రీమేక్ అనడంతో కొంతమందిలో అంచనాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరమే లేదు. అయితే అది పింక్ రీమేక్ అనడంతో కొంతమందిలో అంచనాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. థమన్ సంగీత దర్శకుడిగా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే.

 అప్పుడే మ్యూజిక్ పనులు కూడా స్టార్ట్ చేశాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేయాలనేది ప్రస్తుతం దిల్ రాజు టీమ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముందు పూజా హెగ్డే ని అనుకున్నప్పటికీ దిల్ రాజు మనసు మార్చుకున్నాడు. లాయర్ పాత్రలో పూజ సెట్టవ్వదని నిన్నుకోరి ఫెమ్ నివేత థామస్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

2020 బిగ్ మూవీస్.. టాలీవుడ్ @2వేల కోట్లు(+)

ఇక మరొక ముగ్గురి యంగ్ ఫీమెల్స్ రోల్స్ కోసం ఒక బ్యూటిఫుల్ గర్ల్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మల్లేశం సినిమాలో నటించిన తెలుగమ్మాయి అనన్య పవన్ పింక్ రీమేక్ లో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. మల్లేశం సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ అనన్య నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి.

హైదరాబద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసిన అనన్య టాలీవుడ్ లో మంచి అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ దశలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సిద్ధమైతే సినిమాని మొదలుపెట్టాలని దిల్ రాజు ఆలోచిస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?