'చాణక్య' చిత్రాన్ని గోపీచంద్ ఎందుకు ఒప్పుకున్నాడు!

By tirumala ANFirst Published Dec 3, 2019, 4:34 PM IST
Highlights

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు పేరుతో ఇటీవల విడుదలైన చిత్రాలపై విశ్లేషణ అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పరుచూరి హీరో గోపీచంద్ నటించిన 'చాణక్య' చిత్రం గురించి పరుచూరి మాట్లాడారు.

ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు పేరుతో ఇటీవల విడుదలైన చిత్రాలపై విశ్లేషణ అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పరుచూరి హీరో గోపీచంద్ నటించిన 'చాణక్య' చిత్రం గురించి పరుచూరి మాట్లాడారు. తిరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. 

పరుచూరి మాట్లాడుతూ.. ఇటీవల చాలా ఫ్లాప్ చిత్రాలు వచ్చాయి. వాటి గురించి మాట్లాడుతుంటే ఆ హీరోల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి నేను నెగిటివ్ గా మాట్లాడడం లేదు. ఇలా ట్రై చేసి ఉంటే బావుండేదేమో అనే కోణంలోనే చెబుతున్నాను. రీసెంట్ గా చాణక్య చిత్రాన్ని చూసినట్లు పరుచూరి పేర్కొన్నారు. 

ఈ చిత్రం చూడగానే అసలు గోపీచంద్ ఈ కథని ఎందుకు ఓకే చేశాడు అనే అనుమానం కలిగింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన సాహసం చిత్రం విజయం సాధించింది. బహుశా అందుకే చాణక్య చిత్రాన్ని కూడా అగీకరించి ఉండొచ్చు. కానీ సాహసం, చాణక్య వేరు వేరు కథలు. 

సాహసం గుప్త నిధి నేపథ్యంలో సాగే చిత్రం. చాణక్య చిత్రం కథ టెర్రరిజం నేపథ్యంలో ఉంటుంది. చాణక్య చిత్రంలో నేటివిటీ మిస్ అయింది. టెర్రరిజం తరహా కథలు ఎక్కువగా నార్త్ లో వర్కౌట్ అవుతాయి. ఆ మధ్యన వచ్చిన గూఢచారి చిత్రం విజయం సాధించింది. ఆ చిత్రంలో అంతర్లీనంగా టెర్రరిజంతో పాటు తండ్రీకొడుకుల కథ కూడా ఉంది. అందుకే ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు అని పరుచూరి అన్నారు. 

ఈ చిత్రంలో ఫస్టాఫ్ లో ఉండే లవ్ సీన్స్ వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో సైతం నమ్మశక్యం కానీ సన్నివేశాలు చూపించారు. హీరో RAW ఏజెంట్ అనే విషయాన్ని మొదట రివీల్ చేయాల్సింది కాదు. నేను ఈ కథలో భాగమై ఉంటే గోపీచంద్ ని బ్యాంక్ ఉద్యోగిగానే పరిచయం చేయాలని చెప్పేవాడిని అని పరుచూరి అభిప్రాయ పడ్డారు. 

తెలుగులో టెర్రరిజం తరహా కథలు రాయాలని అనుకుంటే అందులో ప్రేమని కానీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఉండేలా జాగ్రత్త పడాలి అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. 

click me!