రాజుగారి గది 3: ఓంకార్ సొంత తెలివి కాదా..?

Published : Oct 15, 2019, 07:55 AM ISTUpdated : Oct 15, 2019, 08:07 AM IST
రాజుగారి గది 3: ఓంకార్ సొంత తెలివి కాదా..?

సారాంశం

రీమేక్ అన్న విషయం దాచి పెట్టి, అంతా తమ తెలివే అని  చెప్పుకోవాలని చాలా మంది దర్శక,నిర్మాతలకు కోరిక ఉంటుంది. దాంతో లీగల్ గా సమస్యలు రాకుండా ఉండటం కోసం రైట్స్ తీసుకున్నా, ఆ విషయం దాచి పెట్టి ఒరిజనల్ సినిమా అన్నట్లు ప్రమోట్ చేస్తూంటారు. ఓంకార్ గతంలో మలయాళంలో తెరకెక్కిన 'ప్రేతమ్' ను 'రాజు గారి గది 2' టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసాడు. 

రీమేక్ చేయటం కొత్తా కాదు..తప్పూ కాదు. అయితే రీమేక్ అన్న విషయం దాచి పెట్టి, అంతా తమ తెలివే అని  చెప్పుకోవాలని చాలా మంది దర్శక,నిర్మాతలకు కోరిక ఉంటుంది. దాంతో లీగల్ గా సమస్యలు రాకుండా ఉండటం కోసం రైట్స్ తీసుకున్నా, ఆ విషయం దాచి పెట్టి ఒరిజనల్ సినిమా అన్నట్లు ప్రమోట్ చేస్తూంటారు. ఓంకార్ గతంలో మలయాళంలో తెరకెక్కిన 'ప్రేతమ్' ను 'రాజు గారి గది 2' టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసాడు.

అయితే ఆ విషయాన్ని రివీల్ చేయకుండా దాచి, సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యే సరికి  ఓంకార్ చివరకు ఆ మళయాళ సినిమా నుండి సోల్ తీసుకొని తమ ఆత్మ  కథను రాసుకొన్నానంటూ కవర్ చేసే ప్రయత్నం చేసాడు.  ఇప్పుడు‘రాజుగారి గది’ సిరీస్‌లో వస్తున్న మరో చిత్రం ‘రాజుగారి గది 3’. ఓంకార్‌ దర్శకత్వంలో అశ్విన్‌బాబు, అవికా గోర్‌ జంటగా నటించారు. అక్టోబర్‌ 18న ఈ చిత్రం విడుదల కానుంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కూడా రీమేక్ అనే విషయం బయిటకు వచ్చింది.  

ఈ సినిమా 'దిల్లుకు దుడ్డు 2' అనే తమిళ సినిమాకు రీమేక్ అనే విషయం మీడియాలో స్ప్రెడ్ అవుతోంది.   సంతానం హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ బాగానే ఆడింది. ఫుల్ లెంగ్త్ కామెడీ హారర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు ముందు దిల్లుకు దుడ్డు' చేసాడు సంతానం. ఆ సినిమా హిట్ అయ్యింది. ఈ ఊపులో ఈ సీక్వెల్ చేసాడు. ఇక దిల్లుకు దుడ్డు ' తెలుగులో  'దమ్ముంటే సొమ్మేరా' టైటిల్ తో రిలీజ్ అయింది. ఇప్పుడు ఇలా సెకండ్ పార్ట్ ని ఓంకార్ 'రాజు గారి గది 3' గా రీమేక్ చేశాడట. మరి ఈ విషయంపై ఓంకార్ ఈ సారి ఎలా కవర్ చేస్తాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?