జయలలిత బయోపిక్ లో నిజాలే కనిపిస్తాయి: నిత్యా మీనన్

Published : Oct 29, 2019, 12:59 PM ISTUpdated : Oct 29, 2019, 01:01 PM IST
జయలలిత బయోపిక్ లో నిజాలే కనిపిస్తాయి: నిత్యా మీనన్

సారాంశం

సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం జయలలిత బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే సినిమాలో రాజకీయా వివాదాలు అలాగే జయ వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఘటనలు ఎక్కువగా  కనిపించవని కామెంట్స్ వచ్చాయి.

టాలెంటెడ్ యాక్టర్ నిత్యా మీనన్ గత కొంత కాలంగా కథలను ఎంచుకోవడంలో స్లోగా అడుగులు వేస్తోంది. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం జయలలిత బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే సినిమాలో రాజకీయా వివాదాలు అలాగే జయ వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఘటనలు ఎక్కువగా  కనిపించవని కామెంట్స్ వచ్చాయి.  

అలాగే పలు రకాల నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించడంతో సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదనే రూమర్స్ కూడా ఎక్కువవడంతో ఫైనల్ గా నిత్యా మీనన్ గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చింది. సినిమా స్క్రిప్ట్ పనులు దాదాపు ఎండింగ్ కి వచ్చేశాయని దాదాపు అన్ని నిజాలే కథలో కనిపిస్తాయని చెప్పింది. అదే విధంగా రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి దర్శకుడు ప్రియదర్శి అలాగే మిగతా టెక్నీషియన్స్ రెడీ అవుతున్నారని వివరణ ఇచ్చారు.

ఇయర్ ఎండింగ్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నట్లు చెప్పిన నిత్యా జయలలిత జీవితంలో ఎవరు చూడని కోణాల్ని చూపించనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఇక కంగనా రనౌత్ కూడా జయలలిత కథతో మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ కూల్ డైరెక్టర్ ఏఎల్. విజయ్ ఈ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సినిమాలో ఇతర రాజకీయ నాయకులకు జయలలిత ఇచ్చిన కౌంటర్స్ యధావిధిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?