భీష్మ రిలీజ్ ను అడ్డుకుంటాం.. మొదలైన టైటిల్ వివాదం!

prashanth musti   | Asianet News
Published : Feb 18, 2020, 11:22 AM IST
భీష్మ రిలీజ్ ను అడ్డుకుంటాం.. మొదలైన టైటిల్ వివాదం!

సారాంశం

భీష్మ' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా టైటిల్ పై మెల్లగా వివాదం రాజుకుంటోంది. సినిమా టైటిల్ పై పలువురు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నితిన్ - రష్మిక మందన్న జంటగా నటించిన 'భీష్మ' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా టైటిల్ పై మెల్లగా వివాదం రాజుకుంటోంది. సినిమా టైటిల్ పై పలువురు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ జన్మ బ్రహ్మచార్యం పాటించిన మహాభారత మూల పురుషుడి పేరును ఒక సినిమాకు వాడటం కరెక్ట్ కాదని అంటున్నారు.

భీష్మ పేరుతో సినిమాని విడుదల చేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయని సోమవారం జరిగిన ఒక మీటింగ్ లో ధార్మిక సెల్‌ కన్వీనర్‌ తూములూరి శ్రీకృష్ణచైతన్య శర్మ తెలిపారు.  సోమవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎఎస్‌ఎ్‌సలోజరిగిన సమావేశంలో బిజెపి ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే సినిమాలో హీరోను లవర్ బాయ్ గా చూపిస్తూ.. అతనికి భీష్మ అనే పేరును వాడటం కరెక్ట్ కాదని అన్నారు.

వీలైనంత త్వరగా టైటిల్ మార్చాలని చిత్ర యూనిట్ ని హెచ్చరించారు. లేని పక్షంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని అన్నారు. అలాగే న్యాయస్థాన వరకైనా వెళతామని నేతలు మాట్లాడారు. ఇక భీష్మ సినిమా ఈ నెల 21న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశి నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?