నితిన్ మ్యారేజ్ డేట్ ఇదే.. హాజరు కాబోయే అతిథులు ఎంతమందంటే!

Published : Jan 24, 2020, 10:25 PM IST
నితిన్ మ్యారేజ్ డేట్ ఇదే.. హాజరు కాబోయే అతిథులు ఎంతమందంటే!

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ జయం చిత్రంతో 2003లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. కెరీర్ ఆరంభంలోనే నితిన్ మంచి స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. జయం, సై, దిల్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు పడడంతో నితిన్ క్రేజ్ యువతలో అమాంతం పెరిగింది. 

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ జయం చిత్రంతో 2003లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. కెరీర్ ఆరంభంలోనే నితిన్ మంచి స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. జయం, సై, దిల్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు పడడంతో నితిన్ క్రేజ్ యువతలో అమాంతం పెరిగింది. 

కానీ ఊహించని విధంగా నితిన్ కెరీర్ ని బ్యాడ్ ఫేజ్ వెంటాడింది. దాదాపు నితిన్ కు దశాబ్దకాలం హిట్ లేదు. కొన్నేళ్ల క్రితం ఇష్క్ చిత్రంతో మళ్ళీ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇష్క్ తర్వాత నితిన్ కు వరుస విజయాలు దక్కాయి. దీనితో మరోసారి నితిన్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం నితిన్ ఆచి తూచి కథలు ఎంచుకుంటూ కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటున్నాడు. 

ప్రస్తుతం నితిన్ వయసు 36 ఏళ్ళు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకడైన నితిన్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. కుటుంబ సభ్యులు బలవంత పెడుతున్నా నితిన్ మ్యారేజ్ ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. త్వరలో నితిన్ ఓ ఇంటివాడు కాబోయే సంధర్భం ఆసన్నమైంది. 

నితిన్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 16న నితిన్ వివాహం షాలిని అనే యువతితో జరగబోతోంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన షాలినితో నితిన్ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరి ప్రేమని ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పెళ్లిపీటలెక్కబోతున్నారు. 

ప్రస్తుతం నితిన్ పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితిన్ సోదరి నిఖిత రెడ్డి దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నారు. ఏప్రిల్ 16న దుబాయ్ లో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు కొద్దిమంది మాత్రమే అతిథులు హాజరు కానున్నారు. ఇరు కుటుంబ సభ్యుల నుంచి 50 మంది బంధుమిత్రులని మాత్రమే ఈ పెళ్ళికి ఆహ్వానిస్తున్నారట. 

పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులందరిని నితిన్ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?