నా కెరీర్ లోనే అది చెత్త సినిమా.. బ్లాక్ బస్టర్ మూవీతో మోసపోయిన నయనతార!

Published : Nov 05, 2019, 04:07 PM IST
నా కెరీర్ లోనే అది చెత్త సినిమా.. బ్లాక్ బస్టర్ మూవీతో మోసపోయిన నయనతార!

సారాంశం

లేడీ సూపర్ స్టార్ నయనతార గత రెండు దశాబ్దాలుగా దూసుకుపోతోంది. నయన్ వయసు పెరుగుతున్నా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సౌత్ ఇండియాలోని బిగ్ స్టార్స్ అందరితో నయన్ స్క్రీన్ షేర్ చేసుకుంది. 

నయనతార ఇప్పటివరకు రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అజిత్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో నటించింది. నయనతార వన్నె తరగని అందంతో, సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా నయన్ రాణిస్తోంది. నయనతార కెరీర్ లో ఎన్నో ఘనవిజయాలు ఉన్నాయి. 

తనపై ఎన్ని వివాదాలు, పుకార్లు ఉన్నా నయన్ వాటిని పట్టించుకోదు. తన పని తాను చేసుకుని వెళ్లే రకం. తాను సైన్ చేసిన సినిమాలో నటించామా లేదా.. అంతవరకే.. ఇక ప్రమోషన్స్ ని కూడా నయన్ పట్టించుకోదు. 2003లో నయనతార మలయాళీ చిత్రంతో నటిగా పరిచయమైంది. 

నయన్ కెరీర్ లో 2005 గోల్డెన్ ఇయర్ గా చెప్పొచ్చు. ఆ ఏడాది విడుదలైన సూపర్ స్టార్ రజని చంద్రముఖి, సూర్యగజినీ చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలతో నయనతార సౌత్ లో స్టార్ గా మారిపోయింది. అప్పటి నుంచి తెలుగు, తమిళ నిర్మాతలు నయన్ కాల్ షీట్స్ కోసం ఎగబడ్డారు. 

సాధారణంగా తమ కెరీర్ లో చెత్త సినిమా ఏదని అడిగితే ఫ్లాప్ మూవీ పేరు చెబుతారు. కానీ నయనతార విచిత్రంగా బ్లాక్ బస్టర్ మూవీ పేరు చెప్పింది. తన కెరీర్ లోనే సూర్య సరసన నటించిన గజినీ చిత్రం చెత్త మూవీ అని ఓ రేడియో షోలో తెలిపింది. 

నయన్ కామెంట్స్ కు అభిమానులంతా షాక్ అయ్యారు. అందుకు గల కారణాన్ని నయనతార వివరించింది. ఆ చిత్రంలో దర్శకుడు మురుగదాస్ తనకు చెప్పిన పాత్ర వేరు.. చిత్రీకరించిన విధానం వేరు అని నయన్ తెలిపింది. ఆ చిత్రంలో మొదట నాదే ప్రధాన పాత్ర అనుకున్నా.. ఆసిన్ చేస్తోంది సెకండ్ హీరోయిన్ గా అని భావించా. కానీ చివరకు గజినీ మూవీలో సెకండ్ హీరోయిన్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చిందని వాపోయింది. 

మురుగదాస్ తెరకెక్కించిన గజినీ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. సూర్య సినీ జీవితాన్నే మార్చేసిన మూవీ అది. హిందీలో అమిర్ ఖాన్ నటించగా అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?