బ్రేకింగ్: జెర్సీ రీమేక్.. హీరోగా కబీర్ సింగ్

Published : Oct 14, 2019, 12:47 PM IST
బ్రేకింగ్: జెర్సీ రీమేక్.. హీరోగా కబీర్ సింగ్

సారాంశం

ఈ ఏడాది సమ్మర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన నాని జెర్సీ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించడానికి టీమ్ సిద్ధమైంది. ఇక సినిమా నిర్మాణంలో తెలుగు నిర్మాతలు ఉండడం విశేషం. దిల్ రాజు అల్లు అరవింద్ సినిమా రీమేక్ హక్కులను కొన్ని నెలల క్రితం దక్కించుకున్నారు. 

అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో సక్సెస్ అందుకున్న షాహిద్ కపూర్ మరో టాలీవుడ్ రీమేక్ తో సిద్దమవుతున్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన నాని జెర్సీ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించడానికి టీమ్ సిద్ధమైంది. ఇక సినిమా నిర్మాణంలో తెలుగు నిర్మాతలు ఉండడం విశేషం.

దిల్ రాజు అల్లు అరవింద్ సినిమా రీమేక్ హక్కులను కొన్ని నెలల క్రితం దక్కించుకున్నారు.  ఇక బాలీవుడ్ లో సినిమా రీమేక్ కానున్నట్లు గత కొన్నాళ్లుగా అనేక రకాల రూమర్స్ వినిపించాయి. ఇక ఫైనల్ గా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అమన్ గిల్ తో తెలుగు నిర్మాతలు చేతులు కలిపి జెర్సీ రీమేక్ కి ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇక కథ ఒరిజినల్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అదే తరహాలో బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు.  

వేరే ఆలోచన లేకుండా షాహిద్ కబీర్ సింగ్ సెంటిమెంట్ తో జెర్సీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాబాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 250కోట్లకు పైగా లాభాల్ని అందించింది. ఇక అదే తరహాలో జెర్సీ సినిమాతో సక్సెస్ అందుకోవాలని షెడ్యూల్స్ ని ఫిక్స్ చేసుకున్నాడు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టు 28న రిలీజ్ చేయాలనీ సిద్ధమవుతున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?