యూట్యూబ్ లో లీక్, హీరో ఆత్మహత్య బెదిరింపు!

By AN TeluguFirst Published Dec 11, 2019, 7:37 AM IST
Highlights

ఓ ప్రక్క సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుండగా, సినిమా మొత్తం యూట్యూబ్‌లో ఉండడంతో చిత్ర బృందం షాక్ అయ్యామంటోంది. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి 'నానిగాడు' సినిమా తీశామని, సెన్సార్‌ బోర్డ్‌ కూడా యు సర్టిఫికెట్‌ ఇచ్చిందని తెలిపింది. 

సినిమా రిలీజ్ కు ముందు లీక్ అవటం, నెట్ లో పెట్టేయటం వంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అవి కొద్దో గొప్పో క్రేజ్ ఉన్న సినిమాలకు వచ్చే సమస్య. అయితే సినిమా పేరు కూడా ఎవరికి పెద్దగా తెలియని ఓ సినిమాని యూట్యూబ్ లో పెట్టేసారని, దాన్ని తొలిగించాలని వివాదం జరుగుతోంది.  కొత్తగా పరిచయం అవుతున్న నటుడు దుర్గా ప్రసాద్‌ హీరోగా నటించిన 'నానిగాడు' సినిమాని మొత్తం యూట్యూబ్‌లో పెట్టేసారట.

ఓ ప్రక్క సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుండగా, సినిమా మొత్తం యూట్యూబ్‌లో ఉండడంతో చిత్ర బృందం షాక్ అయ్యామంటోంది. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి 'నానిగాడు' సినిమా తీశామని, సెన్సార్‌ బోర్డ్‌ కూడా యు సర్టిఫికెట్‌ ఇచ్చిందని తెలిపింది. ఎంతో కష్టపడి చిత్రాన్ని తెరకెక్కిస్తే విడుదల చేయకముందే యూట్యూబ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే యూట్యూబ్ లో సినిమా పెట్టిందెవరో ఆ లింక్ సైబర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్లే అది ఏ సర్వర్ నుంచి  అప్ లోడ్ అయ్యిందో చూసి వాళ్ల అంతు చూస్తారు. అంతేకాని ఎవరో యూట్యూబ్ లో పెడితే ఫిల్మ్ ఛాంబర్ కు సంభందం ఏముంటుంది. సినిమా పెద్దలు ఏం చెయ్యగలరు.

కుర్ర యాంకర్ గ్లామర్ షో.. రెడ్ శారీలో హాట్ నెస్ అదుర్స్

పెద్ద సినిమా సీన్సే లీక్ అయితేనే చాలా సార్లు దిక్కు ఉండని పరిస్దితి. ఇంక ఎవరికీ తెలియని ఈ సినిమాని యూట్యూబ్ లో పెట్టి మాత్రం ఏం చెయ్యగలరు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని. తమ సినిమాకు ప్రీ పబ్లిసిటీ కోసం చేస్తున్న ప్రయత్నం అని  కొందరు సినిమావాళ్లు కొట్టిపారేస్తున్నారు. యూట్యూబ్ లో ఆ సినిమా ట్రైలర్స్ కనపడుతున్నాయి కానీ ,సినిమా మాత్రం కనపడటంలేదు. అయినా నిజంగా పెట్టేసినా ఎవరూ చూడకపోతే డ్యామేజ్ అవటం అనేది జరగదు.

ఇక ఈ విషయమై చిత్ర యూనిట్ పోలీసులను ఆశ్రయించామని చెప్తున్నారు. అంతే కాకుండా తమకు న్యాయం చేయాలని కోరుతూ  హీరో దుర్గా ప్రసాద్ ఫిలిం ఛాంబర్ వద్ద ధర్నాకు దిగాడు.. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ “40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి `నానిగాడు` సినిమా తీశాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. `యు` సర్టిఫికేట్ కూడా వచ్చింది. సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఎవరో యూట్యూబ్‌లో మొత్తం సినిమాలో అప్‌లోడ్ చేసేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అలాగే యూట్యూబ్ లింక్ ను వెంటనే తొలగించి న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు న్యాయం జరగకపోతే రేపు చిత్ర యూనిట్‌తో సహా ఛాంబర్ వద్ద ఆత్మహత్య చేసుకుంటాం“ అని హెచ్చరించాడు.

click me!