తెలంగాణాకు హీరో, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విరాళం.. ఎందుకంటే?

Published : Apr 03, 2020, 06:01 PM ISTUpdated : Apr 03, 2020, 06:06 PM IST
తెలంగాణాకు హీరో, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విరాళం.. ఎందుకంటే?

సారాంశం

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా తెలుగు రాష్ట్రాలకు తన వంతు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ నేతగా, ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్‌ కు విరాళం ప్రకటించటం పెద్దగా చర్చకు రాకపోయినా.. తెలంగాణకు విరాళం ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.

కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. అన్ని రంగాలు మూత పడటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్తే కుదేళయిపోయింది. దీంతో ఈ మహమ్మారితో పోరాడే శక్తి కూడా చాలా దేశాలకు లేకుండా పోయింది. మన దేశంలోనూ కరోనా రోజు రోజుకి విజృభిస్తోంది. దీంతో కరోనా పై పోరాటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. తమ వంతుగా ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా సినీ ప్రముఖులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా తెలుగు రాష్ట్రాలకు తన వంతు 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ నేతగా, ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్‌ కు విరాళం ప్రకటించటం పెద్దగా చర్చకు రాకపోయినా.. తెలంగాణకు విరాళం ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.

అయితే రాజకీయ నాయకుడిగా అయితే బాలయ్య కూడా కేవలం ఆంధ్రకే విరాళం ఇచ్చే వాడు. కానీ సినీ హీరోగా తనకు ఇరు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటంతో రెండు రాష్ట్రాలకు భారీ విరాళాలు ప్రకటించాడు. అదే సమయంలో సినీ రంగంలో షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలు ఆగిపోవటం కారణంగా కష్టాలు పడుతున్న కార్మికుల కోసం కూడా 25 లక్షల రూపాయలు ప్రకటించాడు బాలయ్య.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?