బాలయ్య 'రూలర్' పోస్టర్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

By AN Telugu  |  First Published Oct 26, 2019, 3:21 PM IST

ఈ సినిమా బాలయ్య ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ లో పోలీస్ యూనిఫాంలో ఉన్న బాలయ్య చేతితో పెద్ద సుత్తిని పట్టుకుని ఆగ్రహంగా కనపడుతున్నారు. 


నటసింహా నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రెండో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి 'జై సింహా' అనే సినిమా తీశారు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో వీరి కాంబోలో మరో సినిమా తెరకెక్కింది.

అయితే, ఈ సినిమా టైటిల్ గురించి కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ‘రూలర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ దీపావళి కానుకగా పోస్టర్ వదిలారు. ఈ సినిమా బాలయ్య ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ లో పోలీస్ యూనిఫాంలో ఉన్న బాలయ్య చేతితో పెద్ద సుత్తిని పట్టుకుని ఆగ్రహంగా కనపడుతున్నారు.

Latest Videos

'రాములో రాములా' సాంగ్.. గొంతు కలిపిన స్టైలిష్ స్టార్!

ఈ పోస్టర్ లో బాలయ్య లుక్ కాస్త తేడాగా ఉంది. హెయిర్ స్టైల్ పెద్దగా సూట్ అవ్వలేదు. అసలు బాలయ్యేనా..? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఈ పోస్టర్ వదిలిన కాసేపటికే సోషల్ మీడియాలో ఈ లుక్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా చూపించడం రాకపోతే ఎలా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'కావాలనే ఇలాంటి పోస్టర్లు వదులుతారా..?' అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 

Here is the First look of as
From 👑

Worlwide release on December 20th! pic.twitter.com/NeMAThuI1p

— C Kalyan (@ProducerCKalyan)
click me!