'అశ్వథ్థామ' సేఫేనా, కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

By tirumala ANFirst Published Feb 5, 2020, 8:07 PM IST
Highlights

'ఛలో' సినిమా సూపర్ హిట్ తర్వాత మళ్లీ అలాంటి సినిమా పడలేదు నాగశౌర్య కు. రీసెంట్ గా  సమంతతో కలిసి నటించిన ఓ బేబీ సినిమా సక్సెస్ సాధించినా కూడా అది నాగ శౌర్య ఖాతాలో పడలేదు. దాంతో తన సొంత ప్రొడక్షన్‌లో, తన సొంత కథతో  'అశ్వథ్థామ' సినిమాతో మన ముందుకు వచ్చాడు. 

'ఛలో' సినిమా సూపర్ హిట్ తర్వాత మళ్లీ అలాంటి సినిమా పడలేదు నాగశౌర్య కు. రీసెంట్ గా  సమంతతో కలిసి నటించిన ఓ బేబీ సినిమా సక్సెస్ సాధించినా కూడా అది నాగ శౌర్య ఖాతాలో పడలేదు. దాంతో తన సొంత ప్రొడక్షన్‌లో, తన సొంత కథతో  'అశ్వథ్థామ' సినిమాతో మన ముందుకు వచ్చాడు. మొన్న శుక్రవారం రిలీజైన ఈ చిత్రం యావరేజ్ టాక్ అందుకుంది. రాక్షసుడు సినిమాకు మళ్లీ ఆర్డర్ వేసి తీసారని అన్నారంతా.  అయితే ఈ సినిమాలో చర్చించిన విషయం ఓ వర్గాన్ని బాగానే ఆకట్టుకుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సక్సెస్ ..నాగ శౌర్య చాలా అత్యవసరం. తను నిర్మాతగా ఒడ్డున పడటం అటుంచి, కెరీర్ కు చాలా అత్యవసరమైన హిట్ ఇది.  

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రేడ్ వివరాలు చూస్తే ...ఈ సినిమా ఇప్పటికే  12 కోట్లు గ్రాస్ వచ్చిందని నిర్మాతలు చెప్తున్నారు. ఈ వీకెండ్ కు సేఫ్ జోన్ లోకు వచ్చేస్తుందని వస్తున్న కలెక్షన్స్ బట్టి అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 6.6 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా చేసారు. ప్రస్తుతం కలెక్షన్స్ డల్ గా ఉన్నా..వీకెండ్ లో పికప్ అవుతుందని భావిస్తున్నారు.

విశాఖ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఇటీవల ఎక్కువగా జరుగుతున్న అమ్మాయిలపై అఘాయిత్యాలు అన్నది బేసిక్ పాయింట్.   ఈ సినిమా ఫుల్ లెంగ్త్ క్రైమ్ డ్రామా. హీరో నాగశౌర్యని సైతం ఇంతవరకు ఏ దర్శకుడూ చూపని రీతిలో చాలా ఫెరోషియస్ గా చూపటంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.  నాగ శౌర్య  రెండేళ్లు కష్టపడి మనసు పెట్టి ఈ కథను రాసానని చెప్తున్నారు.

ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మెహ్రీన్ ప్రిజాద హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను నాగశౌర్య స్వయంగా తన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకు గిబ్రాన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, శ్రీచరణ్ పాకాల పాటలు అందించారు. ఈ సినిమాకు నిర్మాత ఉష మాల్పూరి.
 

click me!