పొలిటికల్ ఎఫెక్ట్.. సైరాకి 20కోట్ల ట్యాక్స్ దెబ్బ?

By Prashanth MFirst Published Dec 18, 2019, 9:07 AM IST
Highlights

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా నరసింహా రెడ్డి. మునుపెన్నడు లేని విధంగా మెగాస్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది. బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస ప్రమోషన్స్ తో ఐదు భాషల్లో సినిమాను రిలీజ్ చేశారు. కానీ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

మెగాస్టార్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా నరసింహా రెడ్డి. మునుపెన్నడు లేని విధంగా మెగాస్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది. బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస ప్రమోషన్స్ తో ఐదు భాషల్లో సినిమాను రిలీజ్ చేశారు. కానీ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

తెలుగు రాష్ట్రాల్లో తప్పితే సైరా సినిమాకు మరెక్కడ కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది.  అయితే ఈ సినిమాని నిర్మించిన రామ్ చరణ్ నష్టాల డోస్ గట్టిగానే పడ్డట్లు అర్ధమవుతోంది. కేవలం జీఎస్టీ ట్యాక్స్ కారణంగా 20కోట్లు చెల్లించాల్సి వచ్చిందట. సాధారణంగా ఫ్రీడమ్ ఫైటర్స్ సినిమాలను తెరకెక్కించినప్పుడు పన్ను ప్రభుత్వాల నుంచి మినహాయింపు ఉంటుంది.

గతంలో చంద్రబాబు హయాంలో బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు లభించింది.  అయితే ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు మాత్రం అది వర్తించలేదు. దీంతో రాజకీయ పరంగా మెగాస్టార్ కి ప్రభుత్వాల నుంచి సరైన సపోర్ట్ లభించలేదని టాక్ వస్తోంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ తన 152వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో మెగాస్టార్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రభుత్వ ఉద్యోగిగానే కాకుండా నక్సలైట్ గా యాంగ్రీ షెడ్ ని చూపించబోతున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమాను చిత్ర యూనిట్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలో హీరోయిన్ గా త్రిషను అనుకుంటున్నట్లు సమాచారం.

click me!