నాకు డైలాగులు నేర్పింది ఆయనే.. గొల్లపూడి మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి!

By tirumala ANFirst Published Dec 12, 2019, 8:32 PM IST
Highlights

సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గొల్లపూడి మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు.

సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గొల్లపూడి మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు. గొల్లపూడి చెన్నైలోనే కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు.  

మారుతీరావు నటుడిగా, రచయితగా, దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు  ఎన్నో సేవలందించారు. విలక్షణమైన నటనతో అద్భుతమైన పాత్రలని పోషించారు. మారుతీరావు పోషించిన విలన్ పాత్రలు కూడా గమ్మత్తుగా ఉంటాయి. 

తనతో కలసి ఎన్నో చిత్రాల్లో నటించిన మారుతీరావు మృతి చెందారని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మారుతీరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు చిరు ప్రఘాడ సానుభూతి తెలియజేశారు. 

ఈ సంధర్భంగా చిరంజీవి మారుతీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 1979లో నిర్మాత భావన్నారాయణగారి ద్వారా నాకు గొల్లపూడిగారి పరిచయం జరిగింది. అప్పటికే గొల్లపూడి పెద్ద రచయితగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. మారుతీ రావు దగ్గర డైలాగులు నేర్చుకోమని నాకు సలహా ఇచ్చారు. 

ప్రతి రోజూ మారుతీరావు డైలాగ్స్ విషయంలో నాకు క్లాస్ తీసుకునేవారు. ఆసమయంలోనే మేమిద్దరం మంచి స్నేహితులుగా మారాం. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో ఓ పాత్ర కోసం గొల్లపూడిని తీసుకుంటున్నట్లు కోడిరామకృష్ణ నాతో చెప్పారు. అప్పుడే ఆ పాత్రకు గొల్లపూడి సరిపోతారని అనుకున్నా. శాడిస్ట్ భర్తగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూనే అద్భుతమైన హాస్యాన్ని పండించారు. 

గొల్లపూడిని తాను చివరగా ఆయన కొడుకు పేరు మీద నిర్వహించే అవార్డ్స్ వేడుకలో కలుసుకున్నానని, ఆ తర్వాత కలుసుకునే అవకాశం దక్కలేదని చిరంజీవి అన్నారు. ఇంతలోనే గొల్లపూడి మరణ వార్త వినడం దురదృష్టం అని చిరు విషాదం వ్యక్తం చేసారు. 

click me!