మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు?

By Prashanth MFirst Published Feb 4, 2020, 8:46 AM IST
Highlights

సీనియర్ యాక్టర్ మోహన్ బాబు తెలుగు తెరపై కనిపించి చాలా కాలమవుతోంది. రెగ్యులర్ గా కాకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేసుకుంటూ ముందుకు సాగుతున్న మోహన్ బాబు మహానటి సినిమాలో ఎస్వీ.రంగారావు పాత్రలో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మోహన్ బాబు తెలుగు తెరపై కనిపించి చాలా కాలమవుతోంది. రెగ్యులర్ గా కాకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేసుకుంటూ ముందుకు సాగుతున్న మోహన్ బాబు మహానటి సినిమాలో ఎస్వీ.రంగారావు పాత్రలో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు.  అయితే చాలా రోజుల తరువాత మరో ఇంట్రెస్టింగ్ పాత్రకీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అది కూడా మెగా స్టార్ సినిమాలో నటించనుండడం విశేషం. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మోహన్ బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.  దాదాపు సినిమాలో పాత్రలన్నింటికీ నటీనటులను ఫైనల్ చేసిన దర్శకుడు ఒక నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రకు మాత్రం ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు.

అయితే ఆ పాత్రకు మోహన్ బాబును అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన మెగాస్టార్ కి విలన్ గా చేస్తున్నారంటూ.. మరికొన్ని మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే సినిమాలో సెట్స్ కోసమే దర్శకుడు ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.  చూస్తుంటే సినిమా బడ్జెట్ 150కొట్లను దాటేలా కనిపిస్తోంది.

కేవలం ఒక కాలనీ సెట్ కోసమే 20కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారట. అలాగే సినిమాలో ఒక టెంపుల్ కూడా చాలా కీలకమైనది కావడంతో అందుకు సంబందించిన సెట్ కోసం భారీగా ఖర్చు చేయనున్నారట.  దర్శకుడు కొరటాల ఎంత ఖర్చు చేసినా కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా మంచి లాభాలని అందిస్తాడని నిర్మాత రామ్ చరణ్ కాస్ట్ దగ్గర వెనుకాడడం లేదు. మరీ ఇంతలా అంచనాలకు మించి నిర్మిస్తున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక గాసిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొరటాల ఒక ముఖ్యమైన పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించినట్లు టాక్ వస్తోంది. సినిమా సెకండ్ హాఫ్ లో కథను మలుపు తిప్పే ఒక బలమైన పాత్ర కోసం ఒక స్ట్రాంగ్ లేడి క్యారెక్టర్ అవసరం పడిందట. దీంతో విజయశాంతి అయితే బెటర్ అని చిత్ర యూనిట్ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

click me!