ఇలాగే అందరిని మించిపోవాలి.. అకిరాకు చిరంజీవి బర్త్ డే విషెష్

Published : Apr 08, 2020, 11:50 AM IST
ఇలాగే అందరిని మించిపోవాలి.. అకిరాకు చిరంజీవి బర్త్ డే విషెష్

సారాంశం

ఫ్యూచర్ మెగా ఫ్యామిలీ హీరోగా పరిగణించబడుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ నేడు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు.

ఫ్యూచర్ మెగా ఫ్యామిలీ హీరోగా పరిగణించబడుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ నేడు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు అకిరాని జూనియర్ పవర్ స్టార్ అని సంభోదిస్తూ సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఇటీవల సోషల్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడి కొడుక్కి తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ భవిష్యత్తు బావుండాలని ఆశీర్వదించారు. చిరంజీవి ట్విట్టర్ వేడికాగా 'మన బిడ్డ మనకంటే ఎత్తు ఎదగాలని కోరుకుంటాం.. నా చేతుల్లో ఒదిగిపోయిన ఈ బిడ్డ ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6'4''). అలాగే అన్ని విషయాల్లో అందరిని మించిపోవాలి. హ్యాపీ బర్త్ డే అకిరా అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

ఈ సందర్భంగా చిన్ననాటి అకిరాని ఎత్తుకుని ఉన్న బ్యూటిఫుల్ పిక్ ని చిరంజీవి షేర్ చేసారు. ఈ పోస్ట్ మెగా అభిమానులని ఆకట్టుకుంటోంది. 

ప్రస్తుతం తన తల్లి సంరక్షణలో పెరుగుతున్న అకిరా అప్పుడప్పుడూ మెగా ఫ్యామిలీ వేడుకల్లో కూడా పాల్గొంటున్నాడు. అకిరా టాలీవుడ్ ఎంట్రీ గురించి పవన్ అభిమానుల్లో ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?