కొరటాల ప్లాన్ చెడగొట్టిన చిరు.. క్షమాపణ చెప్పక తప్పలేదు!

prashanth musti   | Asianet News
Published : Mar 02, 2020, 10:39 AM ISTUpdated : Mar 02, 2020, 10:41 AM IST
కొరటాల ప్లాన్ చెడగొట్టిన చిరు.. క్షమాపణ చెప్పక తప్పలేదు!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో అయినా ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టాలని మెగాస్టార్ టార్గెట్ పెట్టుకున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో అయినా ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టాలని మెగాస్టార్ టార్గెట్ పెట్టుకున్నారు. స్క్రిప్ట్ మొదటి నుంచి పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్న కొరటాలకు రీసెంట్ గా మెగాస్టార్ షాక్ ఇచ్చాడు.

మంచి ఈవెంట్ తో టైటిల్ ఎనౌన్స్ చేయాలనీ అనుకున్న కొరటాల ప్లాన్ మొత్తం ఆదిలోనే వృధా అయ్యింది. అందుకు కారణమైన మెగాస్టార్ క్షమాపణ చెప్పక తప్పలేదు. సినిమాకు సంబందించిన టైటిల్స్ పై గత కొంతకాలంగా అనేక రకాల వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. గోవింద, ఆచార్య అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఎన్ని రూమర్స్ వచ్చినా క్లారిటీ ఇవ్వలేదు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా 'ఓ పిట్ట కథ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన మెగాస్టార్ సినిమాకు సంబందించిన విశేషాలపై మాట్లాడుతూ పొరపాటుగా తన నెక్స్ట్ సినిమా టైటిల్ ఆచార్య  అని ఎనౌన్స్ చేశాడు. ఆచార్య అనే టైటిల్ నిజామా.. కాదా.. అని సందేహిస్తున్న తరుణంలో మెగాస్టార్ ఆచార్య అని క్లారిటీ ఇవ్వడంతో సస్పెన్స్ వీడింది. కొరటాల టైటిల్ ని స్పెషల్ గా ఎనౌన్స్ చేయాలనీ అనుకున్నాడట. ఆ విషయంపై స్పందిస్తూ మెగాస్టార్ దర్శకుడికి క్షమాపణ చెప్పేశాడు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?