ఆ శాఖలో అక్రమార్కులపై చిరంజీవి యుద్ధం.. కొరటాల మూవీ స్టోరీ లీక్!

By tirumala ANFirst Published Oct 14, 2019, 8:17 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రంతో మరోమారు తాను బాక్సాఫీస్ రారాజు అని నిరూపించుకున్నారు. సైరా చిత్రం గాంధీ జయంతి సందర్భంగా విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే ఉత్సాహంలో మెగాస్టార్ తన 152వ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. 

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతోంది. సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి పరాజయమే లేకుండా కొరటాల దూసుకుపోతున్నారు. కొరటాల తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా అన్ని చిత్రాలు ఘనవిజయాన్ని సాధించాయి. 

ప్రతి చిత్రంలో కొరటాల ఏదోఒక సామజిక అంశాన్ని టచ్ చేస్తూ వెళుతున్నారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా సందేశాత్మక అంశాలని కథలో చూపించడం అంత సులువైన విషయం కాదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సినీ అభిమానులంతా చిరంజీవి కోసం కొరటాల ఎలాంటి కథని సిద్ధం చేశారు అని చర్చించుకుంటున్నారు. 

కొరటాల, చిరు చిత్ర కథకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలలో జరుగుతున్న అవినీనీతిని కొరటాల టచ్ చేయబోతున్నారట. విలువైన దేవాలయాల సంపద మాయం కావడం, దేవాలయ భూములని రాజకీయ నాయకులూ కబ్జా చేసుకోవడం లాంటి అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారట. 

ఆసక్తికరంగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ శాఖలో జరుగుతున్న అవినీతి చూసి చిరంజీవి బడా రాజకీయ నాయకులకే ఎదురుతిరిగే విధంగా ఈ చిత్ర కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

మెగాస్టార్ 152 చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు, చిరు సరసన నటించే హీరోయిన్ ని దర్శకుడు ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. 

click me!