చరణ్ - పవన్ తో రెడీ.. మెగా మల్టీస్టారర్ పై చిరంజీవి కామెంట్!

Published : Oct 07, 2019, 06:40 PM ISTUpdated : Oct 07, 2019, 07:24 PM IST
చరణ్ - పవన్ తో రెడీ.. మెగా మల్టీస్టారర్ పై చిరంజీవి కామెంట్!

సారాంశం

సైరా సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ ని మరింత పెంచుతోంది. ఇప్పటికే పలు ఏరియాల్లో కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక మీడియాతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో చాలా పాజిటివ్ గా స్పందించారు. 

మెగాస్టార్ నటించిన సైరా సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ ని మరింత పెంచుతోంది. ఇప్పటికే పలు ఏరియాల్లో కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక మీడియాతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో చాలా పాజిటివ్ గా స్పందించారు.

ముఖ్యంగా రామ్ చరణ్ తో సినిమా నటించే అవకాశం ఉందని త్వరలో ఒక స్పెషల్ అప్డేట్ రానున్నట్లు చెప్పడం మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇక దానితో పాటు అభిమానులకు మరింత బూస్ట్ ఇచ్చేలా పవర్ స్టార్ తో కూడా సినిమా చేయడానికి రెడీ అని మెగాస్టార్ఇలా వివరణ ఇచ్చారు.

"నా బిడ్డ తో చేయడం ఎంత హ్యాపీ ఉంటుందో, నా తమ్ముడు తో చేయడం కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది.ఎవరైనా మంచి కథతో వస్తే కళ్యాణ్ తో చేయడానికి నేను,చరణ్ రెడీ" అంటూ మెగాస్టార్ ఆన్సర్ ఇవ్వడంతో ఈ కామెంట్ ఒక్కసారిగా మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ - పవర్ స్టార్ - మెగా పవర్ స్టార్.. ఈ కాంబినేషన్ కలిస్తే సరికొత్త రికార్డులు నమోదవ్వడం కాయం.

మరి ఆ హిస్టారికల్ ఫ్రేమ్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి. ఇక సైరా సినిమాని కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నయనతార - తమన్నా కథానాయికలుగా స్క్రీన్ షేర్ చేసుకోగా అమితాబ్ బచ్చన్ - సుదీప్ - జగపతి బాబు - విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో కనిపించారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?