'అహం బ్రహ్మాస్మి' ఫస్ట్ లుక్: మంచు మనోజ్ ఏమున్నాడు.. గూస్ బంప్స్ గ్యారెంటీ

Published : Mar 04, 2020, 05:51 PM IST
'అహం బ్రహ్మాస్మి' ఫస్ట్ లుక్: మంచు మనోజ్ ఏమున్నాడు.. గూస్ బంప్స్ గ్యారెంటీ

సారాంశం

మంచు వారబ్బాయి మంచు మనోజ్ వెండితెరపై కనిపించి చాలా కాలమే అవుతోంది. 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు చిత్రం తర్వాత మనోజ్ నుంచి మరో చిత్రం రాలేదు.

మంచు వారబ్బాయి మంచు మనోజ్ వెండితెరపై కనిపించి చాలా కాలమే అవుతోంది. 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు చిత్రం తర్వాత మనోజ్ నుంచి మరో చిత్రం రాలేదు. వరుస పరాజయాలు కావచ్చు.. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు కావచ్చు.. మరే ఇతర కారణాలైనా కావచ్చు.. మనోజ్ కెరీర్ లో గ్యాప్ ఏర్పడింది. ఆ ఒడిదుడుకులని అధికమించి పునరుత్తేజంతో మనోజ్ రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి 'అహం బ్రహ్మాస్మి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

మంచు మనోజ్ బాడీ లాగ్వేజ్, నటనకు అభిమానులు ఉన్నారు. ఇటీవల ఈ చిత్ర టైటిల్ ప్రకటించినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మనోజ్ స్వయంగా ట్విటర్ వేదికగా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశాడు. సంతోషం, రౌద్రం, తన్మయత్వంతో ఉండే మూడు విభిన్నమైన షేడ్స్ లో శివ భక్తుడిగా, అఘోరాలా మనోజ్ కనిపిస్తున్నాడు. 

ఒక్క మాటలో ఈ లుక్ గురించి చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. మంచు మనోజ్ కూడా ట్విట్టర్ వేదికగా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఇన్ని రోజుల నా గ్యాప్ ని భర్తీ చేసేలా సిల్వర్ స్క్రీన్ పై గర్జించడానికి రెడీ అవుతున్నాను. క్రైమ్, కామెడీ, యాక్షన్ మిళితమైన ఈ చిత్రం ద్వారా మీకు గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. 

ఎమ్ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. అచు రాజమణి, రమేష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా ఫిలింగా పలు భాషల్లో విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?