మహేష్ న్యూ ప్లాన్.. సమ్మర్ వరకు నో షూటింగ్

prashanth musti   | Asianet News
Published : Jan 16, 2020, 05:28 PM IST
మహేష్ న్యూ ప్లాన్.. సమ్మర్ వరకు నో షూటింగ్

సారాంశం

మహేష్ బాబు మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు ఇప్పటికే టాక్ వైరల్ అయ్యింది. ఇక చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ సెలబ్రేషన్స్ తో సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేస్తోంది. 

సంక్రాంతికి ఫైనల్ గా మహేష్ బాబు మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు ఇప్పటికే టాక్ వైరల్ అయ్యింది. ఇక చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ సెలబ్రేషన్స్ తో సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే వరుస షూటింగ్ లతో గత ఏడాది నుంచి బిజీగా ఉంటున్న మహేష్ రెస్ట్ తీసుకొని చాలా కాలమవుతోంది.

ఇక ఇప్పుడు రెండు నెలల పాటు షూటింగ్ ప్రపంచానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. అమెరికాలోనే తన స్నేహితులతో అలాగే సన్నిహిత బంధువులతో ఏకాంతంగా గడపాలని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ తో కలిసి తిరుపతిలో ఉన్నాడు. అనంతరం అమెరికా వెళ్లాలని అనుకుంటున్నాడు. ఇక మార్చ్ తరువాత ఇండియాకు రాగానే కొత్త సినిమాని మొదలుపెట్టనున్నాడు.

మహర్షి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మహేష్ నెక్స్ట్ వర్క్ చేయబోతున్నాడు. ఆ తరువాత అనిల్ రావిపూడితో కూడా మరో సినిమా చేయాలనీ ఆలోచిస్తున్నాడు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ అందుతున్నాయి. అనిల్ సుంకర - దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?