'సరిలేరు నీకెవ్వరు'.. మహేష్ బాబు లుక్ పై ట్రోల్స్!

Published : Oct 09, 2019, 04:02 PM IST
'సరిలేరు నీకెవ్వరు'.. మహేష్ బాబు లుక్ పై ట్రోల్స్!

సారాంశం

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.   

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో చాన్నాళ్ల తర్వాత సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా కానుకగా చిత్రబృందం ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు.

కొండారెడ్డి బురుజు ముందు ఆర్మీ ప్యాంట్ వేసుకుని చేతిలో గొడ్డలి పట్టుకుని కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న మహేష్ లుక్ ని విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ ని కొందరు నెటిజన్లు టార్గెట్ చేస్తూ మహేష్ ని ట్రోల్ చేస్తున్నారు.

గతంలో మహేష్ బాబు నటించిన 'ఆగడు', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమా పోస్టర్లు ఇప్పుడు మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా పోస్టర్ ఒకే మాదిరి ఉంటున్నాయని.. పోస్టర్లలో కొత్తదనం లేదని అంటున్నారు. ప్రతీసారి మహేష్ బాబు చేతిలో ఏదొక వెపన్ పట్టుకొని నిలబడి ఉంటాడు. దాంతో ప్రతీ సినిమాలో ఒకే స్టిల్ ఇస్తున్నారంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

మిగిలిన హీరోలతో పోలిస్తే మహేష్ తన లుక్ విషయంలో ఎలాంటి కొత్తదనం ఫాలో అవ్వడం లేదని.. కేవలం సినిమాసినిమాకి దుస్తులు మాత్రమే మారుస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మహేష్ బాబుని మాత్రమే అనడానికి లేదు. మహేష్ లుక్స్ తో ప్రయోగాలు చేస్తే రిస్క్ అని దర్శకులు కూడా ధైర్యం చేసుండకపోవచ్చు. 
 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?