టార్గెట్ స్టార్ హీరోస్.. నెక్స్ట్ ఎవరు మహేషా?

By Prashanth MFirst Published Jan 6, 2020, 12:02 PM IST
Highlights

మన స్టార్ హీరోల మధ్య ఐక్యత లేదనే మాట టాలీవుడ్ లో తరచు వినిపించేది. పర్సనల్ గా ఎంత కలుసుకున్నా సినిమా ఈవెంట్స్ కి రావడం అనేది చాలా తక్కువగా ఉండేది. అయితే మెల్లమెల్లగా ఆ ఫార్మాట్ కి ఛెక్ పడుతోంది. 

ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ కాబోతోంది అంటే.. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అభిమానుల అంచనాలు హై రేంజ్ లో ఉంటాయి. ఒకప్పుడు సినిమా రిలీజ్ తరువాత విజయోత్సవ సభలు నిర్వహించేవారు. అప్పుడు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు స్టార్స్ ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్య అతిథులుగా వచ్చేవారు. ఇక మారుతున్న కాలంలో రిలీజ్ కు ముందే ఈవెంట్స్ తో హడావిడి మొదలైంది.  ప్రీ రిలీజ్ పేరుతో సినిమాలను ఈజీగా జనాల్లోకి వెళ్లేలా చేస్తున్నారు.

అయితే మన స్టార్ హీరోల మధ్య ఐక్యత లేదనే మాట టాలీవుడ్ లో తరచు వినిపించేది. పర్సనల్ గా ఎంత కలుసుకున్నా సినిమా ఈవెంట్స్ కి రావడం అనేది చాలా తక్కువగా ఉండేది. అయితే మెల్లమెల్లగా ఆ ఫార్మాట్ కి చెక్ పడుతోంది. ఇక మహేష్ ఆ ఫార్మాట్ కి సరికొత్తగా శ్రీకారం చుట్టాడు. మొన్నటివరకు చిన్న హీరోల సినిమాలకు పెద్ద హీరోలు పెద్ద సినిమాల హీరోలకు చిన్న హీరోలు అనే కాన్సెప్ట్ తో అతిధులను ఆహ్వానించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని కానిచ్చేవారు.

కానీ మహేష్ మాత్రం మంచి స్టార్ ఇమేజ్ ఉన్న ఇతర హీరోలను కూడా తన సినిమాల ఈవెంట్స్ కి ఆహ్వానిస్తున్నారు. భరత్ అనే నేను సినిమాకు ఎవరు ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఇన్వైట్ చేసి అభిమానుల మధ్య కూడా స్నేహ బంధాన్ని పెంచాడు.  ఉన్న కొంత మంది పెద్ద హీరోలు ఇక నుంచి అందరి ఈవెంట్స్ కి వస్తారని మహేష్ అప్పుడే చెప్పేశాడు. ఇక మహర్షి సినిమా ఈవెంట్ కి తనకంటే చిన్న హీరో అయిన విజయ్ దేవరకుడను ఆహ్వానించి తనకు ఎలాంటి ఈగో ఉండదని నిరూపించాడు.

ఇక ఆదివారం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు ఏకంగా మెగాస్టార్ ని దింపిన మహేష్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఏకం చేస్తున్నట్లు చెప్పవచ్చు.  ఇక నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తారో గాని మహేష్ తో కనిపించబోయే హీరో ఎవరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నెక్స్ట్ లీడ్ లో ఉన్నది.. ప్రభాస్ - బాలకృష్ణ- పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ వంటి హీరోలు. పవన్ - బాలయ్య లకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి టచ్ చేసే అవకాశం లేదు.

ఒకానొక సమయంలో పవన్ కి మహేష్ కి బర్త్ డే విషెస్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ వెంటనే డిలీట్ చేశారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎక్కువవ్వడం మహేష్ కి ఇష్టం లేదు. ప్రాక్టికల్ గా వారి మధ్య ఉన్న స్నేహాన్ని చూపించాలని అనుకున్నాడు. సో అందుకే మెల్లగా అందరి హీరోలను కలుపుకుంటూ వెళుతున్నాడు. మహేష్ లానే అందరూ ఫాలో అయితే ఇండస్ట్రీలో అభిమానుల మధ్య గొడవ తగ్గుతుంది. అలాగే సినిమాల పై నెగిటివ్ ప్రచారాలు తగ్గి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి మహేష్ భవిష్యత్తులో ఎవరిని ఇన్వైట్ చేస్తాడో చూడాలి.

click me!